TN People Praise CM Jagan Welfare Schemes: సీఎం జగన్‌పై తమిళనాడు ప్రజలు ప్రశంసలు.. మాకు ఓ జగన్‌ కావాలంటూ

సీఎం జగన్‌పై తమిళనాడు ప్రజలు ప్రశంసలు.. మాకు ఓ జగన్‌ కావాలంటూ

కులమతాలు, పార్టీలు, ప్రాంతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా.. రాష్ట్రంలోని అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నారులు మొదలు.. వయో వృద్ధుల వరకు అన్ని వర్గాల వారి కోసం అనేక రకాల వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్‌. ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై పొరుగు రాష్ట్రాల సీఎంలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం.. జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు భేష్‌ అంటూ మెచ్చుకున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలో తమిళనాడు ప్రజలు చేరారు. మాకు కూడా ఓ జగన్‌ కావాలి అంటున్నారు తమిళ ప్రజలు. సరిహద్దు గ్రామాల్లో నిర్వహించిన గ్రౌండ్‌ రిపోర్ట్‌లో తమిళప్రజలు తమ మనసులోని మాట బయటపెట్టారు. సీఎంగా మాకు ఓ జగన్‌ కావాలి అంటున్నారు.

మిట్టపాళెం, పున్నియం రెండు గ్రామాలు ఏపీ-తమిళనాడు సరిహద్దులో ఉన్నాయి. మిట్టపాళెం ఏపీ బార్డర్‌లో ఉండగా.. పున్నియం తమిళనాడు సరిహద్దులో ఉంది. ఇటు మిట్టపాళెంలోని గ్రామ సచివాలయంలో ఆరోగ్య సేవలు మొదలు.. పింఛన్లు, చదువులు, పౌర సేవలు అన్ని ఒకే చోట లభిస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిర రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటున్నాయి. వాలంటీర్ల ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పనులు అన్ని ప్రజల గడప దగ్గరకే వస్తున్నాయి. చివరకు క్యాస్ట్‌, బర్త్‌, ఇన్‌కం సర్టిఫికెట్లు, మ్యుటేషన్‌, అడంగల్‌ వంటి అన్ని రకాల పౌర సేవలను ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురి కాకుండానే.. ఊరు దాటకుండానే.. ఇంటి వద్దనే పొందగలుగుతున్నారు.

పున్నియంలో పరిస్థితి ఇలా..

అదే పున్నియం గ్రామానికి వస్తే… అక్కడ ఉన్న పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉంది. అధికారులు ఎవరూ తరచుగా అక్కడికి రారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని.. ఏ పని కావాలన్నా.. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళ్లిపట్టులోకి బ్లాక్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం వెళ్లినా.. వెంటనే పని పూర్తవుతుందా అంటే అది లేదని.. 10, 15 సార్లు తిరగాల్సి వస్తుంది అంటున్నారు. ఇక వైద్య సేవలు పొందాలంటే.. 13 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉందని.. అదే ఏపీ మిట్టపాళెం పంచాయతీలో కేవలం 2 వేల జనాభా మాత్రమే ఉన్నా.. అక్కడ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ సేవలు అందిస్తుందని తెలిపారు.

ఏపీ సంబంధాలు చూస్తున్నాము..

అంతేకాక ఏపీలో అమలు చేస్తోన్న పథకాలు చూస్తే.. తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి పథకాలు అమలు చేస్తే బాగుటుంది కదా అని తమిళనాడు జనాలు కోరుకుంటున్నారు. ఏపీలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలు చూసినప్పడు.. అక్కడికి వెళ్లి ఏపీ స్థానికత పొందాలనిపిస్తోందని అంటున్నారు. లేదంటే తమ పిల్లలకు ఆంధ్రాలో పెళ్లి సంబంధాలు చూడాలని భావిస్తున్నారట. ఏపీలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను చూస్తే.. తమకు కూడా జగన్‌ లాంటి సీఎం కావాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు.

Show comments