వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌.. అప్పటినుంచి వర్షాలు మళ్లీ షురూ!

దేశ వ్యాప్తంగా వర్షాలు పడటం బాగా తగ్గిపోయింది. రెండు రోజులకోసారి అన్నట్లు వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ జనం ఇప్పుడు ఎండలతో సతమతం అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ వాతారణ శాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో మళ్లీ వర్షాలు ప్రారంభం అవతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ విషయానికి వస్తే.. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశంలో మేఘాలు అలుముకున్నాయి.

మరికొన్ని రోజుల్లో మరింత దట్టమైన మేఘాలు అలుముకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక, ఏపీలోనూ ఆగస్టు 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జల్లులు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. అయినప్పటికి అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని అన్నారు.

వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాకాతంపై సముద్ర మట్టానికి 4.5కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అంతేకాదు! సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తలో ఓ ద్రోణి ఏర్పడింది. అది కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపు ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచాన వేస్తున్నాం. ఇక, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. మరి, ఆగస్టు 15నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments