రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే!

Indian Railway: ఈ మధ్య కాలంలో ఈ రైల్వే సంస్థ ఎక్కువగా పలు రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లీంచడం వంటి కీలక సమాచారాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే సంస్థ మరోసారి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు.

Indian Railway: ఈ మధ్య కాలంలో ఈ రైల్వే సంస్థ ఎక్కువగా పలు రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లీంచడం వంటి కీలక సమాచారాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే సంస్థ మరోసారి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు.

నిత్యం లక్షాలాది మంది ప్రయాణికులతో నిరంతరం రద్దీగా నడిచే రవాణా సంస్థలో ఇండియాన్ రైల్వే కూడా ఒకటి. ఇక్క ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో రైల్వే సంస్థ ఎప్పుడు ముందుంటుదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు పలు కీలక అప్డేట్ లను ప్రయాణికులకు జారీ చేస్తూ.. అలెర్ట్ చేస్తుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ రైల్వే సంస్థ ఎక్కువగా పలు రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లీంచడం వంటి కీలక సమాచారాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ మధ్య  రైల్వే మరోసారి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఏపీ ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈనెలలో ఏకంగా 14 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలని కడియం, రాజమహేంద్రవరం, గోదావరి, కొవ్వూరు సెక్షన్‌లలో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో పాటు, ఆటోమెటిక్ బ్లాక్ లింగ్ సిస్టమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 29, 30 అక్టోబరు 1 వరకు వివిధ ప్రాంతాల నుంచి సామర్లకోట మీదుగా నడిచే 14 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేశారు. ఈ మేరకు జయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నస్రత్‌ ఎం.మండ్రూప్‌కర్‌ సామర్లకోట రైల్వే అధికారులు ఉత్తర్వులు పంపించారు.

అయితే రద్దు అయిన రైళ్ల వివరాళ్లోకి వెళ్తే.. ఈనెల 29న  విశాఖపట్నం (22708) రైలు , గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239) రైళ్లను రద్దు చేశారు. ఇక 30వ తేదీన.. విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రె స్‌ (22707), విజయవాడ నుంచి విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (12718), విశాఖపట్నం నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (12717), విశాఖపట్నం నుంచి గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (22701), గుంటూరు నుంచి విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22702), గుంటూరు నుంచి విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17239), విశాఖపట్నం నుంచి గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17240), విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రైలు (07768), రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం రైలు (07466), విశాఖట్న నుంచి రాజమహేంద్రవరం రైలు (07467) ఇలా మొత్తం 10 రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం గుంటూరు మధ్య రాకపోకలు సాగించే (17240) రైలు అక్టోబరు 1న రద్దు చేశారు. కనుక ఆయా తేదీల్లో రద్దు అయిన రైళ్ల వివరాలను ప్రయాణికులు దృష్టిలో  పెట్టుకొవాలని, మరింత సమాచారం కోసం రైల్వే స్టేషన్ లోని బుకింగ్ కార్యలయంను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరి, మరమత్తులు కారణంగా ఏపీలోని 14 రైళ్లు రద్దు కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments