Telangana-New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు.. త్వరలోనే ప్రకటన

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు.. త్వరలోనే ప్రకటన

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా చర్యలు తీసకుంటుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ, చేయూత, ఆరోగ్య శ్రీని 10 లక్షల రూపాయలు పెచండంతో పాటు.. రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ఇక మిగతా హామీల అమలుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని అంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనం పొందాలంటే.. రేషన్ కార్డు నంబర్ కంపల్సరీ. ఇదనే కాక.. ప్రభుత్వం తీసుకువచ్చే ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి. పైగా తెలంగాణలో రేషన్ కార్డులు జారీ చేయక చాలా కాలం అవుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం పలు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం ఉంటుందని తెలిపారు.

2014 సవంత్సరం తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ చేయలేదు. అంటే 9 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. చాలా దరఖాస్తులు పెండింగులో ఉండగా.. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా  దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో పాటు కొందరు తమ పాత కార్డుల్లో కొత్త కుటుంబసభ్యుల పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారికి రేషన్ కార్డులు లేవు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1.25 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయని తెలిసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.62 లక్షల కార్డులున్నాయి. అన్నపూర్ణ పథకం కింద 5.21 లక్షల కార్డులున్నాయి. మహాలక్ష్మి పథకం కిద మహిళలకు రూ.2,500 ఇవ్వాలన్నా, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాలు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా పథకం అందాలన్నా రేషన్ కార్డు అవసరం అవుతుంది. దాంతో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు జారీ చేయనుందని.. అంటున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.

Show comments