Uttam Key Announcement: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన!

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన!

Uttam Key Announcement: తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లింపు విషయంలో ఆందోళన చెందుతున్న సమయంలో తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Uttam Key Announcement: తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లింపు విషయంలో ఆందోళన చెందుతున్న సమయంలో తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ఈ మద్యనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకాలు షురు చేశారు. ఇటీవల తెలంగాణలో అకాల వర్షాలు రైతుల తీవ్ర కష్టాల్లోకి నెట్టాయి. చేతికి అందొచ్చిన పంట నీట మునిగిపోవడంతో వడ్డు తడిసిపోయాయి. తడిసిన వడ్ల అమ్మకం పై ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని.. రైతులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత నెలలో తెలంగాణలో వడగండ్ల వానతో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగిపోయాయి. దీంతో రైలుతు తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర వస్తుందా? రాదా? అన్న ఆందోళనలో ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొంటామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కోసం గతంలో కన్నా ఎక్కువ కేంద్రాలు తెరిచామని.. రైతు నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఇదే సమయానికి 13.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ ఏడాది. 24.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తెలంగాణలో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు, పిడుగు పాటుతో చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.

తెలంగాణలో తాగు నీటి కోసం 2.25 టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వం ఇస్తంది. 2019 నవంబర్ లోనే మేడిగడ్డ బ్యారేజ్ లో లోపాలు బయటపడ్డాయి. అప్పుడే ఆ లోపాలు గుర్తించి ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తే ఇప్పుడు ఆ పరిస్తితి వచ్చి ఉండేది కాదని అన్నారు. బ్యారేజీలో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని అన్నారు. కమిటీ పూర్తి నివేదిక వారం రోజుల్లో రానుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామని అన్నారు. జూన్ 9న రాహూల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి.. బీఆర్ఎస్, బీజేపీలకు గతంలో కన్నా తక్కువ సీట్లు వస్తాయని అన్నారు.

Show comments