Tantra Movie Review And Rating In Telugu: అనన్య నాగళ్ల తంత్ర సినిమా రివ్యూ

Tantra Movie Review: అనన్య నాగళ్ల తంత్ర మూవీ రివ్యూ

Tantra Movie Review & Rating In Telugu: అనన్య నాగళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన హారర్ చిత్రం తంత్ర థియేటర్లలో విడుదలైంది. మరి.. ఆ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Tantra Movie Review & Rating In Telugu: అనన్య నాగళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన హారర్ చిత్రం తంత్ర థియేటర్లలో విడుదలైంది. మరి.. ఆ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

తంత్ర

20240315, A
హారర్
  • నటినటులు:అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోనీ, వంశీ, తదితరులు
  • దర్శకత్వం:శ్రీనివాస్ గోపిశెట్టి
  • నిర్మాత:పి.నరేశ్ బాబు, రవి చైతన్య
  • సంగీతం:ఆర్ఆర్ ధృవన్
  • సినిమాటోగ్రఫీ:సాయిరామ్ ఉదయ్, విజయ్ భాస్కర్ సద్దల

2.25

భాషతో సంబంధం లేకుండా హారర్ సినిమా అంటే చాలు సినిమా ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టేస్తారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా హారర్ జానర్ కు ఉన్న డిమాండ్ అలాంటిది. అలాంటి ప్రేక్షకులు ఫుల్ మీల్స్ అన్నట్లు అనన్య నాగళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన తంత్ర సినిమా మార్చి 15న విడుదలైంది. ఈ చిత్రంపై ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా వాళ్లు పిల్ల బచ్చాలు మా సినిమాకి రావొద్దు మాది ఏ సర్టిఫికెట్ చిత్రం అంటూ ప్రకటన చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి.. ఆ అంచనాలను తంత్ర సినిమా అందుకుందా? అనన్య నాగళ్ల యాక్టింగ్ ఎలా ఉంది? అసలు తంత్ర సినిమా కథ ఏంటి? తెలయాలంటే ఈ రివ్యూ చూసేయండి.

కథ:

రేఖ(అనన్య నాగళ్ల) చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. ఆ తర్వాత ఆమె నాన్న దగ్గరే పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తేజూ(ధనుష్ రఘుముద్రి)తో పరిచయం ఉంటుంది. అతడినే ఇష్టపడుతూ ఉంటుంది. అయతే రేఖకు తరచూ దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆమెపై ఎవరో క్షుద్రపూజలు చేశారని, చేతబడి జరిగిందని తేజూకి తెలుస్తుంది. అసలు రేఖకు ఏమైంది? ఆమెపై చేతబడి చేసింది ఎవరు? అసలు విగత(వంశీ), రాజేశ్వరి(సలోని) ఎవరు? వాళ్లకి రేఖకు సంబంధం ఏంటి? రేఖాపై జరిగిన క్షుద్రపూజలను అరికట్టవచ్చా? ఆ పూజల వల్ల రేఖ జీవితం ఎలా మారిపోయింది? అనే విషయాలు తెలియాలంటే మీరు థియేటర్లలో తంత్ర సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎప్పడైతే మా సినిమాకి పిల్ల బచ్చాలు రావొద్దు అంటూ సినిమా బృందం స్టేట్మెంట్లు పాస్ చేశారో.. అప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి.. వాటిని అందుకున్నారా? అంటే అంత పక్కాగా అందుకోలేకపోయారు అనే చెప్పాల. ఈ సినిమాలో చాలా మంచి పాయింట్ ఉంది. హారర్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్, ట్విస్టులు, వణుకు పుట్టించే స్కోప్ చాలానే ఉంది. కానీ, స్క్రీన్ మీద మాత్రం ఆ భయం మిస్ అయ్యిందనే చెప్పాలి. హార్రర్ చిత్రాలకు లాజిక్స్ అక్కర్లేదు.. థియేటర్ కి వచ్చిన ఆడియన్ ని వణింకిచగలిగితే చాలు. అక్కడే డైరెక్టర్ మిస్ ఫైర్ అయ్యాడు. సినిమాలో కథ పరంగా లాజిక్స్, ఎక్సప్లనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు.

కానీ, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. రక్తదాహం, పాతాళ కుట్టి, శత్రవు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. ఇలా మొత్తం ఆరు తాంత్రిక విద్యలు ఉంటాయి. వాటి గురించి డైరెక్టర్ వివరించుకుంటూ పోతాడు. అది చూసిన తర్వాత ఆడియన్స్ ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్ కి వచ్చింది తాంత్రిక విద్య నేర్చుకోవడానికి కాదు. ఆ థ్రిల్ ని ఫీలవ్వడానికి. ఇక్కడే డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి టార్గెట్ మిస్ అయ్యాడు అనిపించింది. పైగా ఈ నరేషన్ వల్ల సినిమా కాస్తా.. సీరియల్ ఫీల్ ని తీసుకొచ్చింది. ఇలా తంత్ర సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. అలాగని ఈ మూవీని పూర్తిగా పక్కన పెట్టేసేది మాత్రం కాదు.

ఎవరెలా చేశారు- టెక్నికల్ వర్క్:

ఈ సినిమాకి అనన్య నాగళ్ల, టెంబర్ వంశీ, సలోనీ బిగ్ అసెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అనన్య నాగళ్ల యాక్టింగ్ మెప్పిస్తుంది. అయితే ఆమెకు తగ్గ సీన్స్ మాత్రం చాలా తక్కువ పడ్డాయి. ఇంక సలోనీ పాత్ర మాత్రం కచ్చితంగా థ్రిల్ చేస్తుంది. ఆ స్థాయి క్యారెక్టర్ ని ఊహించి ఉండరు. ఇంక టెంపర్ వంశీ కూడా తన పాత్రలో జీవించేశాడు. ధనుష్ రఘుముద్రి కూడా తన పాత్రను బాగానే పోషించాడు. కానీ, ఇంకాస్త పరిణతి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంక డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి పెన్నులో పదునుంది అనే విషయం అర్థమవుతుంది. కానీ, పేపరు మీద పెట్టింది.. స్క్రీన్ మీదకు వచ్చేసరికి ఏదో తగ్గింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎంచుకున్న పాయింట్ మంచిదే.. కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం కాస్త అనుభవలేమి కనిపిస్తుంది. ఇంక ఆర్ఆర్ ధృవన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అక్కడక్కడ థ్రిల్ చేస్తుంది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి.

బలాలు:

  • అనన్య నాగళ్ల, లీడ్ యాక్టర్స్
  • కథ

బలహీనతలు:

  • సాగదీత
  • థ్రిల్లింగ్ మిస్ అవ్వడం
  • హారర్ ఎఫెక్ట్ మిస్సింగ్

చివరిగా: తంత్ర సినిమా అనుకున్నంత భయపెట్టలేకపోయింది..

రేటింగ్: 2.25/5

(*గమనిక ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments