RCB vs CSK Virat Kohli On Team Journey: మా పనైపోయిందనుకొని బ్యాగులు సర్దుకున్నా.. అప్పుడేం జరిగిందంటే..: కోహ్లీ

Virat Kohli: మా పనైపోయిందనుకొని బ్యాగులు సర్దుకున్నా.. అప్పుడేం జరిగిందంటే..: కోహ్లీ

ఐపీఎల్-2024లో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ మొత్తం బ్యాట్​తో రఫ్ఫాడించిన కింగ్.. ఇవాళ సీఎస్​కేతో డూ ఆర్ డై మ్యాచ్​లో ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్-2024లో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ మొత్తం బ్యాట్​తో రఫ్ఫాడించిన కింగ్.. ఇవాళ సీఎస్​కేతో డూ ఆర్ డై మ్యాచ్​లో ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్​లో మోస్ట్ ఫ్యాన్​బేస్ కలిగిన జట్లలో ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్​కు ఎంతటి ఆదరణ ఉందో.. అంతే ఆదరణ ఈ టీమ్​కు ఉంది. చెన్నై, ముంబై చెరో 5 సార్లు కప్పులు గెలిచాయి. కాబట్టి ఆ జట్లకు ఈ రేంజ్​లో పాపులారిటీ ఉండటంలో తప్పు లేదు. కానీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోని ఆర్సీబీకి ఇంతటి ఆదరణ దక్కడం మాత్రం అనూహ్యమనే చెప్పాలి. ఆ టీమ్​కు లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా బెంగళూరుకు మద్దతుగా నిలిచేవాళ్లు కోట్లలో ఉన్నారు. ఈసారి ఐపీఎల్ ఫస్టాఫ్​లో ఆ టీమ్ దారుణ ఓటములతో వెనుకంజలో ఉన్నా ఫ్యాన్స్ అండగా నిలిచారు. వాళ్ల మద్దతు ఊరికే పోలేదు. ఓటముల నుంచి కోలుకొని వరుస విజయాలతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​కు ఒక్క అడుగు దూరంలో నిలబడింది ఆర్సీబీ.

సీజన్​లో ఒక దశలో వరుస పరాజయాలతో డీలా పడిపోయింది ఆర్సీబీ. గెలవడమే మర్చిపోయినట్లుగా గ్రౌండ్​లోకి అడుగుపెట్టడం ఓటమితో మ్యాచ్​ను ముగించడం అలవాటుగా చేసుకుంది. ఆ టైమ్​లో తమ పనైపోయిందని అనుకున్నాడట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇక సాధించడానికి ఏమీ లేదనుకొని వెళ్లిపోదామని ఫిక్స్ అయ్యాడట. బ్యాగులు కూడా సర్దుకున్నాడట. కానీ ఆ సమయంలోనే అద్భుతం జరిగిందన్నాడు కింగ్. ఓటముల తర్వాత లేచి నిలబడ్డామని.. పట్టుదలతో ఆడుతూ నెల రోజు గ్యాప్​లో ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపాడు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇది అలాంటి ఇలాంటి కమ్​బ్యాక్ కాదన్నాడు.

‘ఏప్రిల్ నెలలో వరుస ఓటములు పలకరించడంతో నా బ్యాగులు సర్దుకొని సిద్ధమైపోయా. అంతా అయిపోయింది, ఇంక ఏమీ జరగదని ఫిక్స్ అయ్యా. కానీ ఇప్పుడు మేం మంచి పొజిషన్​లో ఉన్నాం. గేమ్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. మేం ఇక్కడి దాకా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆటలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు’ అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇక, ఈ సీజన్​లో విరాట్ భీకరమైన ఫామ్​లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో 155 స్ట్రైక్ రేట్​తో 661 పరుగులు చేశాడు. ఐదు ఫిఫ్టీలు బాదిన కింగ్.. ఓ సెంచరీ కూడా కొట్టాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే కీలకంగా మారిన సీఎస్​కేతో పోరులో అతడు ఎలా ఆడతాడనే దాని మీదే బెంగళూరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మరి.. ఆర్సీబీ కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments