CSK vs RCB- Rain In Bengaluru: చెన్నై- ఆర్సీబీ కీలక మ్యాచ్.. బెంగళూరులో మొదలైన వర్షం!

చెన్నై- ఆర్సీబీ కీలక మ్యాచ్.. బెంగళూరులో మొదలైన వర్షం!

RCB vs CSK- Rain Started In Bangaluru: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై- ఆర్సీబీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. మ్యాచ్ జరగడం గురించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RCB vs CSK- Rain Started In Bangaluru: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై- ఆర్సీబీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. మ్యాచ్ జరగడం గురించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్ ప్రపంచం మొత్తం ఇవాళ బెంగళూరు వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లోనే కీలక మ్యాచ్ అక్కడ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంతో కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ లో నిర్ణీత పరుగులు, వికెట్లతో గనుక ఆర్సీబీ జట్టు విజయం సాధిస్తే మాత్రం వాళ్లు అనూహ్యంగా ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడతారు. ఆర్సీబీ అభిమానులు అంతా ఇవాళ మ్యాచ్ సవ్యంగా సాగాలి అని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశల మీద వరుణ దేవుడు నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఐపీఎల్ అభిమానులు అంతా ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్ కు వాన ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వాతావరణ అధికారులు బెంగళూరులో రాత్రికి వర్షం పడుతుందని చెప్పనే చెప్పేశారు. అందుకు తగినట్లుగానే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశలను గల్లంతు చేస్తూ.. బెంగళూరులో వర్షం మొదలైంది. బెంగళూరులో సిటీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురవడం ప్రారంభమైంది. అలాగే చిన్నస్వామి స్టేడియం ప్రాంతంలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

బెంగళూరు వాసులనే కాదు.. ఆర్సీబీ అభిమానులను కూడా ఈ వర్షం కంగారు పెడుతోంది. ఎందుకంటే వర్షం కారణంగా ఈ మ్యాచ్ గనుక రద్దైతే.. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే. అలాగే చెన్నై గెలిచినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు క్వాలిఫై అయిపోయాయి. మిగిలి ఉన్న ఆ ఒక్క స్పాట్ కోసం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఆర్సీబీ తొలి మ్యాచుల్లో వరుస పరాజయాలతో డీలా పడ్డా కూడా.. ఆఖరి మ్యాచుల్లో మాత్రం వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టినా కూడా ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, వరుణుడు మాత్రం ఆర్సీబీ మీద పగపట్టినట్లు కనిపిస్తోంది. నిజానికి చిన్నస్వామి స్టేడియంలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఎన్ని నీళ్లు ఉన్నా క్షణాల్లో ఇంకి పోతున్నాయి. కానీ, కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరలేదు. అందుకే బెంగళూరులో వర్షం కురవకూడదు అని కోరుకుంటున్నారు. మరి.. ఆర్సీబీ- చెన్నై మ్యాచ్ జరుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments