Rohit Sharma Reacts On Hardik Pandya In T20 WC: వరల్డ్ కప్​ టీమ్​లో హార్దిక్​కు నో ప్లేస్! అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

Rohit Sharma: వరల్డ్ కప్​ టీమ్​లో హార్దిక్​కు నో ప్లేస్! అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్​ టీమ్​లో పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు లేదంటూ వస్తున్న వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. అసలు విషయం ఏంటనేది హిట్​మ్యాన్ చెప్పేశాడు.

టీ20 వరల్డ్ కప్​ టీమ్​లో పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు లేదంటూ వస్తున్న వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. అసలు విషయం ఏంటనేది హిట్​మ్యాన్ చెప్పేశాడు.

ఐపీఎల్​తో ఫుల్​ ఎంటర్​టైన్ అవుతున్న క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచడానికి ఇంకో టోర్నమెంట్ రెడీ అవుతోంది. జూన్​లో ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ జరగనుంది. మెగా టోర్నీకి సంబంధించిన ప్రిపరేషన్స్​లో టీమ్స్ బిజీ అయిపోయాయి. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ప్రిపరేషన్స్​ చేస్తున్నారు. క్యాష్ రిచ్​ లీగ్​లో రాణించి అదే ఫామ్​ను పొట్టి కప్పులోనూ కొనసాగించాలని చూస్తున్నారు. టీ20 ప్రపంచ కప్​కు బయల్దేరే భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈసారి స్క్వాడ్​లో పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కదని రూమర్స్ వస్తున్నాయి. పాండ్యాకు మొండిచెయ్యి తప్పదని జోరుగా వినిపిస్తోంది. ఈ విషయం మీద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్​లో అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు హార్దిక్. బౌలింగ్​లో వికెట్లు తీయకపోగా భారీగా రన్స్ లీక్ చేస్తున్నాడు. అతడి బౌలింగ్​లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వరుసగా మూడు భారీ సిక్సులు బాదాడు. బ్యాటింగ్​లోనూ కీలక టైమ్​లో గ్రౌండ్​లోకి దిగుతున్న పాండ్యా రన్స్ చేయకపోగా బాల్స్​ను వృథా చేస్తూ నెక్స్ట్ వచ్చే బ్యాటర్లపై మరింత ప్రెజర్ పడటానికి కారణం అవుతున్నాడు. ఈ చెత్తాటతో అతడు వరల్డ్ కప్​కు సెలక్ట్ అవడం కష్టమేనని.. వెళ్లినా టీమ్​కు మైనస్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా రోహిత్ స్పందించాడు. ఇప్పుడు ఏది పడితే అది వైరల్ అయిపోతుందని.. కానీ అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మొద్దన్నాడు.

వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ విషయంలో తాను గానీ లేదా కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులు గానీ కెమెరా ముందు వచ్చి అధికారికంగా ప్రకటించే వరకు ఏ వార్తనూ నమ్మొద్దని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. బోర్డు నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వస్తుందని.. అప్పటిదాకా ఇతర రూమర్లను పట్టించుకోవద్దని, అవన్నీ ఫేక్ అని హిట్​మ్యాన్​ చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్​ టీమ్​ సెలక్షన్​కు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ దిగడం ఫిక్స్ అని టాక్ నడుస్తోంది. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ యాక్షన్​లోకి దిగుతారని.. స్పిన్ ఆల్​రౌండర్ రోల్​ను రవీంద్ర జడేజా పోషిస్తాడని వినిపిస్తోంది. పేస్ బాధ్యతల్ని బుమ్రాతో కలసి సిరాజ్, అర్ష్​దీప్ పంచుకుంటారని సమాచారం. ఐపీఎల్​లో అదరగొడుతున్న దినేష్ కార్తీక్​ను సెలక్టర్లు పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే స్క్వాడ్​లో ఎవరు ఉంటారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Show comments