అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్ అతి తక్కువ ధరలోనే!

అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్ అతి తక్కువ ధరలోనే!

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర కూడా 21 వేలకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర కూడా 21 వేలకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ వచ్చాక లోకం పోకడ మారిపోయింది. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నవారు ఎందరో ఉన్నారు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే పొందే వీలుండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ఇక మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ లు ఇప్పటిక తమ హవా కొనసాగిస్తున్నాయి. మార్కెట్ లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటికీ కొత్తగా రిలీజ్ అయ్యే మొబైల్స్ కోసం వెయిట్ చేసే వారు ఎంతోమంది. ఇలాంటి స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ వర్షన్, ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ల కోసం చూసేవారికి బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

మోటోరోలా బ్రాండ్ కు చెందిన మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8జీబీ+128జీబీ, 12జీబీ + 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ మే 22 నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 2వేలు బ్యాంక్ ఆఫర్ ఉన్నందున ఈ ఫోన్ రూ.20,999కి దక్కించుకోవచ్చు. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 24,999కు పొందవచ్చు. ఈ ఫోన్ ను రూ. 22, 999కి సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు:

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డిజైన్ ఆకట్టుకుంటోంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ 3డీ కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. హై రిఫ్రెష్ రేట్ 144హెచ్‌జెడ్ 1,600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో యూజర్లు కలర్ వ్యూను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌ను అందించారు. ఐపీ68 వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 68వాట్ల టర్బో పవర్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 700 సీ సెన్సర్, 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, డబుల్స్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.

Show comments