Rishabh Pant Celebrate MS Dhoni's Birthday: ధోని బర్త్ డే.. రిషబ్ పంత్ స్పెషల్ సర్ప్రైజ్!

ధోని బర్త్ డే.. రిషబ్ పంత్ స్పెషల్ సర్ప్రైజ్!

  • Author Soma Sekhar Published - 01:39 PM, Fri - 7 July 23
  • Author Soma Sekhar Published - 01:39 PM, Fri - 7 July 23
ధోని బర్త్ డే.. రిషబ్ పంత్ స్పెషల్ సర్ప్రైజ్!

మహేంద్ర సింగ్ ధోని.. తన ఆటతీరుతో.. కెప్టెన్సీతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తాజాగా జూలై 7న తన 42వ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మిస్టర్ కూల్. అయితే ధోని కంటే ఎక్కువగా అతని అభిమానులే మహేంద్రుడి బర్త్ డేని ఓ పండగగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన ఆటగాడి పుట్టిన రోజు కావడంతో.. భారీ కటౌట్స్ పెట్టి.. ధోనీపై ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ధోనీ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ పుట్టినరోజు సందర్భంగా.. అతడిపై ఉన్న ప్రేమను తెలియపరిచాడు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్.

రిషబ్ పంత్.. గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. కోలుకుంటున్నాడు. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను తాజాగ షేర్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్. దాంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రాబోయే వరల్డ్ కప్ కు పంత్ అందుబాటులో ఉండాలని అందరు ఆశిస్తున్నారు. ఇక తన ఫిట్ నెస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు పంత్. ఈ క్రమంలోనే జూలై 7న ధోనీ పుట్టినరోజు కావడంతో.. అతడి బర్త్ డే ను సెలబ్రేట్ చేశాడు రిషబ్ పంత్. ధోని కటౌట్ తో ఉన్న చిన్న ఫోటోను కేక్ పై ఉంచి.. కేక్ ను కట్ చేశాడు.

“ధోని భాయ్ నేను నీ పక్కన లేకున్నా.. కేక్ కట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మహీ” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు పంత్. ధోనితో కలిసి ఆడిన పంత్.. అతడి సాన్నిహిత్యంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. ధోనీ విలువైన సలహాలు, సూచనలు పంత్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండటంతోనే.. ధోనీ బర్త్ డేను సర్ప్రైజింగ్ గా సెలబ్రేట్ చేశాడు రిషబ్ పంత్. ప్రస్తుతం పంత్ షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

Show comments