Vizag: విశాఖలో అలజడి.. వెనక్కి వెళ్లిన సముద్రం.. కారణమిదేనా

Vizag: విశాఖలో అలజడి.. వెనక్కి వెళ్లిన సముద్రం.. కారణమిదేనా

ఆంధ్ర ప్రజలకు పర్యటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. ముఖ్యంగా ఇక్కడ విశాఖ సాగర తీరం అనేది ఎంతో ప్రత్యేకమైనది. నిత్యం ఎంతోమంది ప్రజలు, టూరిస్ట్ లు సాగర తీరంలో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఉన్నట్టుండి విశాఖ బీచ్ లో వచ్చిన మార్పులకు నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

ఆంధ్ర ప్రజలకు పర్యటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. ముఖ్యంగా ఇక్కడ విశాఖ సాగర తీరం అనేది ఎంతో ప్రత్యేకమైనది. నిత్యం ఎంతోమంది ప్రజలు, టూరిస్ట్ లు సాగర తీరంలో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఉన్నట్టుండి విశాఖ బీచ్ లో వచ్చిన మార్పులకు నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. ఇక్కడకు వచ్చిన ప్రతి పర్యాటకులు తిరిగి ప్రయాణం అయ్యే వరకూ ఎన్నో ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ విశాఖపట్నంలో వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ముఖ్యంగా విశాఖ సాగర తీరం అనేది ప్రత్యేకమైనది. ఇక్కడికి నిత్యం నగర వాసులే కాకుండా చాలమంది టూరిస్ట్ లు సెలవులకు, స్పెషల్ అకేషన్స్‌ కు పిల్లలతో సరదగా గడిపెందుకు వస్తారు. అంతేకాకుండా.. తెల్లవారుజామున వాకింగ్ మొదలు రాత్రి వరకు అందరూ సరదగా సముద్ర తీరన సేద తీరేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇదిలా ఉంటే.. నిత్యం ఏదో ఒక సమయంలో విశాఖ బీచ్ ని సందర్శించే నగర వాసులు అక్కడ ఏ చిన్నపాటి మార్పు జరిగినా ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా విశాఖ పట్నం బీచ్ లో వచ్చిన మార్పులకు నగర వాసులకు ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిత్యం జనసంద్రతతో రద్దీగా ఉండే విశాఖ సముద్ర తీరం ఏ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్న ప్రజలు త్వరాగా కనిపెడతారు. తాజాగా విశాఖ లో ఓ అరుదైన ఘటన జరిగింది. నగరంలోని సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం అక్కడ ప్రజలు ఆందోళనకు గురవుతన్నారు. అలాగే సముద్రం ఒడ్డు నుంచి 100 అడుగులు వెనుకకు తగ్గింది. నగరంలోని గత మూడు నాలుగు రోజులుగా సముద్రం నిరంతరం కాస్త వెనుకకు వెళ్తుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం సమీప ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే గత నెలలో సముద్రం చాలా ముందుకు ఉండేదని, ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయిందని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇక విశాఖ సాగరం ఉన్నటుండి వెనక్కి పోవడంపై జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, సహజంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల కారణమో అని నగర వాసుల్లో ఊహగనలు అలుముకుంటున్నాయి. ఇక ఈ విషయం పై మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ.. జపాన్లో జరిగిన భూకంపానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదని అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు సముద్రం లోపల జరిగే అనేక రకాల పరిణామాలు వల్ల తీరాలపై ప్రభావం చూపిస్తాయని ఆయన తెలిపారు.

కాగా, సాధారణంగా ఇది టూరిస్ట్ సీజన్ కావడంతో ఎంతోమంది పర్యటకులు విశాఖ సాగర బీచ్ కు వస్తున్నారు.ఈ నేపథ్యంలో సముద్రం కాస్త లోపలకు వెళ్లడంతో లోపల ఉండే సముద్రపు రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అక్కడ ఫోటోలు తీసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. మరి, ఇలా ఉన్నటుండి విశాఖ బీచ్ వెనుకకు వెళ్లడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments