లోకేష్ కనగరాజ్ పక్కా ప్లాన్.. ‘లియో’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్?

లోకేష్ కనగరాజ్ పక్కా ప్లాన్.. ‘లియో’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్?

  • Author Soma Sekhar Published - 02:53 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Published - 02:53 PM, Tue - 4 July 23
లోకేష్ కనగరాజ్ పక్కా ప్లాన్.. ‘లియో’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్?

గత కొంతకాలం నుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతోంది. కలెక్షన్లలో గానీ.. సినిమా మేకింగ్ విషయంలో గానీ హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తోంది. ఇక హీరోలు సైతం మల్టీస్టారర్ మూవీల బాట పట్టారు. గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ ట్రెండ్ మెుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రెండ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పీక్స్ కు వెళ్లిందనే చెప్పాలి. డైరెక్టర్లు సైతం అభిమానులను సర్ప్రైజ్ చేయడం కోసం సినిమాల్లోకి కొందరు స్టార్ హీరోలను క్యామియో రోల్ కింద తీసుకుంటున్నారు. తాజాగా ఓ వార్త సినిమా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లియో. ఈ సినిమాలో క్యామియో రోల్ చేయనున్నాడట టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

లియో.. ప్రస్తుతం అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్న చిత్రం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష జంటగా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కశ్మీర్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లియోకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లియో మూవీలో క్యామియో రోల్ చేస్తున్నాడట. ఇక విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రను మించి రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. ఇక ఈ న్యూస్ ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే లోకేష్ యూనివర్స్ లోకి రామ్ చరణ్ ఎంటర్ అయితే.. ఆ లెక్కే వేరేగా ఉంటుందంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా.. ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్.. ప్రస్తుతం తన టైమ్ ను తన బిడ్డకే కేటాయించారు. కొన్ని రోజులు గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారు రామ్ చరణ్. అయితే లియోలో రామ్ చరణ్ క్యామియో రోల్ పై మేకర్స్ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. మరి లియోలో రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments