Rains: ఏపీ, తెలంగాణాల్లో మరో రెండు రోజులు వానలు..!

ఏపీ, తెలంగాణాల్లో మరో రెండు రోజులు వానలు..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వింత పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు అవుతుందో లేదో సూరీడు మండిపోతున్నాడు. అంతలోనే మధ్యాహ్నం నుండి వాతావరణం చల్లబడిపోతుంది. కొన్ని చోట్ల చిరు జల్లులు, మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వింత పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు అవుతుందో లేదో సూరీడు మండిపోతున్నాడు. అంతలోనే మధ్యాహ్నం నుండి వాతావరణం చల్లబడిపోతుంది. కొన్ని చోట్ల చిరు జల్లులు, మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తోంది. ఎండకాలం వచ్చేసింది అనుకుంటున్న సమయంలో వర్షాలు పడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కాసేపు ఎండ.. మరి కొంత సేపటికి వాన కురుస్తోంది. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎండ వేడిమికి వానలు తోడు కావడంతో ప్రజలు కాస్త ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. అయితే పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను భయపెట్టాయి.

కాగా, రానున్న రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వర్షాలు తడపున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఉరుములు, పిడుగులు పడవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో తేలిక పాటి జల్లుల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పలు చోట్ల వడగళ్ల వాన పడతాయని చెబుతోంది. ఇటు తెలంగాణలో కూడా ద్రోణీ ప్రభావం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు వానలు పడుతున్నాయి. వేసవి రాకుండానే ఇప్పటికే సర్రుమంటున్న సూరుడి ప్రతాపంతో విసిగిపోయిన ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ వానలతో కాస్త ఉపశమనం చెందుతున్నారు. అయితే రైతులకు మాత్రం కడగండ్లుగా మారాయి ఈ వర్షాలు.

ఏపీలో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణలో కూడా వడగండ్లతో కూడిన వానలు పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పంట చేతికొచ్చే సమయం కావడంతో అన్నదాతలు నీరుగారిపోతున్నారు. ఈ అకాల వర్షాలకు దిగులు చెందతున్నారు కర్షకులు. ఇక రానున్న రెండు రోజుల పాటు వానలు కురవనున్నాయని తెలుస్తోంది. దీంతో మరింత ఆందోళనలో ఉన్నారు రైతులు. ఈ వాతావరణ మార్పులతో ఉద్యోగాలకు, వ్యాపారాలతో బయటకు వెళ్లే ప్రజలు కాస్త చిరాకు పడుతున్నారు. భానుడి భగభగలకు కాస్త ఉపశమనం అనిపించినా.. మరుసటి రోజు ఎండ మండిపోవడంతో కాస్త బెంబేలు ఎత్తుతున్నారు.

Show comments