Padma Vibhushan Mega star Chiranjeevi: ఆయనే ఒక మైలురాయి. .ఆయనే ఒక సందర్శనీయ క్షేత్రం

ఆయనే ఒక మైలురాయి. .ఆయనే ఒక సందర్శనీయ క్షేత్రం

ఆయన ముందు సినీగమనం వేరు. ఆయన ఎదిగిన తర్వాత సినీగమన విలక్షత ఇంకా వేరు. చిరంజీవిని చూడ్డానికే సినిమాధియేటర్లకు ప్రేక్షకులు పరిగెత్తి వచ్చే ఒక ట్రెండ్ కి పాదు వేసిన అక్షరసత్యమైన హీరోయిజంకి చిరంజీవి చెరపలేని, చెరిగిపోని చిరునామా.

ఆయన ముందు సినీగమనం వేరు. ఆయన ఎదిగిన తర్వాత సినీగమన విలక్షత ఇంకా వేరు. చిరంజీవిని చూడ్డానికే సినిమాధియేటర్లకు ప్రేక్షకులు పరిగెత్తి వచ్చే ఒక ట్రెండ్ కి పాదు వేసిన అక్షరసత్యమైన హీరోయిజంకి చిరంజీవి చెరపలేని, చెరిగిపోని చిరునామా.

ఒక ప్రయాణం… జీవితాన్ని ఆద్యంతం మార్చేసిన ప్రయత్నం… అహర్నిశల శ్రద్ధాపూర్వక అంకితభావం….ఇవి ఎవరి గురించి రాసినా సరిపోని మాటలు. ఒకే ఒక్క వ్యక్తి తన దీక్ష ద్వారా శక్తిగా ఎదిగిన ఒక నిరంతర సినీ ప్రవాసి. సినీ కళామతల్లికి నీరాజనాలు పట్టి, ఒంటరిగా వచ్చి, వచ్చిన ప్రతీ అవకాశాన్ని తన ఎదుగుదలకు సోఫానంగా మార్చుకుని, 45 ఏళ్ళ సుదీర్ఘప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళను నెలకొల్పి, తన తర్వాతి తరాలకు దిశానిర్దేశం చేసిన ఒక మహత్తర జీవనశైలికి ప్రతిబింబమైన శిఖారాయమాన నిలువెత్తు కథానాయక పర్వానికి తెరలేపిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే మెగాస్టార్ జీవితానికి మాత్రమే అనువైన మాటలివి. అదునైన అక్షరాల వరసలివి.

ఎన్ని సార్లు చెప్పినా సరే తనివితీరని ఉపోద్ఘాతం ఆయన విషయంలో విసుగురాదు. ఎవరూ ఆసరా లేని జీవితపుకోణంలో, తన అడుగులు తనకు మాత్రమే వినిపించేంత నిశ్శబ్దం తన చుట్టూ అల్లుకున్నా, కంటి ముందు తాను ఏకాగ్రతతో చూడగలిగిన సుదూరతీరాల అపూర్వవైభవాలను గుండెనిండా నింపుకుని, నిరాశకు నిలువనీడ లేని స్వయం ప్రోత్సాహంతో, స్వయంప్రకాశక శక్తితో ముందడుగు వేసిన నటజీవితపు తొలిదశలో చిరంజీవి గడిపిన శైలి.

అడుగులన్నీ పెడుగులై, మలుపులన్నీ గెలుపులై, సినీజీవితంలో తన ఎత్తును మించిన ఎత్తు చిత్రపరిశ్రమలో మరొకటి లేదు, మరొకటి రాదు అనే నిజానికి తన జీవితాన్నే నిదర్శనంగా చేసిన ఒక నాయకయోధుడిగా ఎదిగిన చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమ దారితెన్నులనే సమూలంగా మార్చివేశారు. ప్రత్యేకమైన పోకడలతో, నిర్దిష్టమైన ధోరణులతో ప్రేక్షకలోకానికి సరికొత్త ఉత్సాహాన్ని అందించి, ధియేటర్లు దద్దరిల్లే ఊపుని, ఉవడిని కల్సించిన అసమాన వైచిత్రి చిరంజీవిది.

 

ఆయతోనే ప్రారంభమైన అనేకమైన సంచలనాల సంబరాలు ఎన్నో, ఎన్నెన్నో. తెలుగు సినిమా బాక్సాఫీసు స్టామినా ఇంత ఉంటుందా, ఇంత ఉందా అని అక్షరాల నిరూపించిన రికార్డు నాటికి, నేటికీ, ఏనాటికీ చిరంజీవి అనబడే మెగాస్టార్ దే. ఏరియాల వైజ్ సినిమా క్రయవిక్రయ లావాదేవీలను ఆయన ప్రభావితం చేసినంతగా మరే హీరో తెలుగు చిత్రసీమలో చేయలేదు, చెయ్యలేకపోయారంటే కేవలం అది పచ్చినిజమే గానీ, అతిశయోక్తి కానే కాదు. అందుకు చరిత్రపేజీలే సజీవసాక్ష్యాలు.

నామమాత్రపు పాత్రలు, నెగెటివ్ పాత్రలు, దాదాపుగా విలన్ పాత్రలతోనే సినీజీవితాన్ని ప్రారంభించినా, ఒక హీరో ఎలా ఉండాలో నిర్వచించే స్థాయికి చిరంజీవి ఎదగడం కేవలం ప్రేక్షకలోకానికి ఆయనిచ్చిన నజరానా. ఈనాముల ఫర్మానా. కమర్షియల్ చిత్రాల మూసకట్టుని చెరిపేసి, రిస్క్ లు చేసి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే ఫీట్లను ప్రవేశపెట్టి, హీరోయిజం అంటే డూప్ లతో కాదు, డేరింగ్ డేషింగ్ గా చేసినప్పుడే ప్రేక్షకులు తన పట్ల చూపించే ఆసక్తికి, అనురక్తికి నిజమైన నివాళి అని అంతరాంతరాలలో అనుకున్న తొలిహీరో చిరంజీవే. మలిహీరో కూడా చిరంజీవే.

ఆయన ముందు సినీగమనం వేరు. ఆయన ఎదిగిన తర్వాత సినీగమన విలక్షత ఇంకా వేరు. చిరంజీవిని చూడ్డానికే సినిమాధియేటర్లకు ప్రేక్షకులు పరిగెత్తి వచ్చే ఒక ట్రెండ్ కి పాదు వేసిన అక్షరసత్యమైన హీరోయిజంకి చిరంజీవి చెరపలేని, చెరిగిపోని చిరునామా. ఒక పక్కన మాస్ కమర్షియల్ చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఆటవిడుపుగా ఉత్తమోత్తమ చిత్రాలుగా విద్యావంతమైన ప్రేక్షకజనసమూహాలు గుర్తించి, ఆయనను మనసారా అభినందించే సినిమాలను కూడా చేయడం భారతీయ సినిమాలో ఒక్క చిరంజీవి జీవితంలో మాత్రమే మనం చూడగలం.

ఒక పక్కన సినీ జీవిత సంరంభాలు తెరిపిలేకుండా కొనసాగుతుండగా, మరోవైపు తనవంతు సామాజిక సేవ ద్వారా మానవసంబంధ అనుబంధాలకు అర్ధం చెప్పే ప్రయత్నంలో భాగంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి ప్రారంభించి సంఘంలో ఒక అత్యుత్తమ పౌరుడిగా తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న సమున్నతవిలువకు చిరంజీవి ప్రత్యక్ష ప్రతిబింబం. ఎంతమందికి ఆయన సేవల ద్వారా ప్రాణోపయోగమైన ఉపకారాలు జరిగాయో లెక్క చెప్పడం కష్టం. ఇదీ నిజజీవిత కథానాయకత్వానికి నిర్వచనం.

ప్రభుత్వాలు మాత్రమే ప్రజలకు ఉపయోగపడాలి అనే నానుడిని తిరగరాసి, తనే ఒక కాపలా ప్రభుత్వమై ఎందరి ప్రాణాలకో కంచుకవచమై నిలబడ్డారు చిరంజీవి. అది కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను కాచికాపాడే ఔదార్యామైతేనేం, కరోనా బారిన పడి ఆక్సిజన్ స్థాయి పడిపోతుండగా ప్రాణాలు ప్రమాదాల అంచున కొట్టుమిట్టాడుతున్న క్షణాలలో ఆయన పంపించిన ఆక్సిజన్ సదుపాయం ఎందరికి ఊపిరిపోసిందో….

అందుకే ఆయన్ని వరించిన ఏ బిరుదూ, ఏ గౌరవపురస్కారం, ఏ సత్కారం కూడా ఆయనకి ఊరికే వచ్చినవి కావు. అనాలోచితంగా ఆయనకి ఎవరూ ఇచ్చినవి కాదు. ఆయనే స్వయంగా సాధించుకున్నవి. వేసిన ప్రతీ అడుగులోనూ తనదైన ప్రత్యేకతకు ప్రాణప్రతిష్ట చేస్తూ చేసిన ప్రయాణంలో పద్మభూషణ్ గానీ, నిన్నటి పద్మవిభూషణ్ గానీ అయనలోని నిండు అర్హతలకు అందిన గౌరవాలు మాత్రమే. సాధించిన ఘనతే నిరూపిస్తుంది. నిలుపుకున్న వ్యక్తిగత సౌథమే గోపురాలను నిర్మిస్తుంది.

అవును చిరంజీవి డాక్టరే. కళ్ళ ముందు ప్రతీ అంశాన్నీ, అది సినిమా అయినా, సామాజికసేవ అయినా కూడా వాటిని శక్తివంతంగా, సమర్ధవంతంగా, అర్ధవంతంగా ట్రీట్ చేసిన డాక్టర్ ఆయన. అందుకే ఆయన డాక్టర్ చిరంజీవి. ఇలా అడుగడుగునా ఆయన ప్రతిభావంతమైన ఛాయలు చిత్రసీమ పరిధిని దాటి, విశాలమైన సమాజయవనికపైన వెల్లువెత్తిన చిరంజీవి విశ్వరూపం ఆయనకి ఎన్ని బిరుదలనైనా తెచ్చిపెడుతుంది. ఇచ్చి పెడుతుంది. దేనికైనా ఆయనే కొలమానం.

 

                                                                                                      -నాగేంద్ర కుమార్

Show comments