కారు యాక్సిడెంట్ వల్ల పవిత్ర చనిపోలేదు.. భర్త చంద్రకాంత్ షాకింగ్‌ కామెంట్స్!

కారు యాక్సిడెంట్ వల్ల పవిత్ర చనిపోలేదు.. భర్త చంద్రకాంత్ షాకింగ్‌ కామెంట్స్!

ఇటీవలే ప్రముఖ బుల్లితెర నటి పవిత‍్ర జయరామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త తాజాగా భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎలా చనిపోయిందో అనే షాకింగ్‌ నిజాలను చెప్పుకొచ్చారు.

ఇటీవలే ప్రముఖ బుల్లితెర నటి పవిత‍్ర జయరామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త తాజాగా భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎలా చనిపోయిందో అనే షాకింగ్‌ నిజాలను చెప్పుకొచ్చారు.

ప్రముఖ బుల్లితెర నటి పవిత‍్ర జయరామ్‌ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక పవిత్ర మరణ వార్త తెలిసిన నుంచి  సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించి రోజుకొక వార్త వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా ఆమె అకాల మరణం తట్టుకోలేని కుటుంబ సభ్యులు, తోటి నటు నటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే.. ఆమెను తలుచుకుంటూ ప్రతిఒక్కరూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవిత్ర భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె  యాక్సిడెంట్‌ ఎలా చనిపోయిందో అనే షాకింగ్‌ విషయాలను చెప్పుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పవిత్ర జయరామ్ తనదైన నటనతో ప్రేక్షకులను  ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, గత రెండు రోజుల క్రితం కర్ణాటక నుంచి హైదరబాద్ వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు, భర్త చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పవిత్ర భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించలేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు. అలాగే ఆమె మరణానికి అసలు కారణం వెల్లడించారు.

కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర భర్త చంద్రకాంత్‌ మాట్లాడుతూ..  ‘మేము కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు బెంగళూరు వెళ్లాము. అయితే అక్కడ ప్రాజెక్టుకు సంతం చేసి కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నాము. అయితే కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చొగా.. పవిత్ర సోదరి కూతురు డ్రైవర్ పక్కన కూర్చుంది. ఇక మేమందరం గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో..  మా కారు డివైడర్ ను ఢీకొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. అయితే  నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ పవిత్ర షాక్ లోకి వెళ్లిపోయింది.

ఇక సమయానికి అంబులెన్స్‌ రాకపోవడంతో పవిత్ర మరణించింది. అదే అంబులెన్స్‌ సమయానికి వచ్చుంటే.. తాను బతికుండేది. అయితే పవిత్ర గుండెపోటు రావడం వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు చెప్పారు. ఎందుకంటే.. యాక్సిడెంట్‌ అయినప్పుడు నాకు దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయాను. ఇక తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన తర్వాత పవిత్ర చనిపోయిన విషయం తెలిసింది. అసలు మేము భార్యాభర్తలు అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకున్నాము. కానీ, అంతలోనే తను నన్ను విడిచి వెళ్లిపోయింది’ అంటూ చంద్రకాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు . మరి, పవిత్ర జయరామ్‌ మరణం పై భర్త చెప్పిన షాకింగ్‌  నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments