OTT Suggestiosns For This Weekend: OTTలోకి 16 సినిమాలు.. వీకెండ్ కి ఈ 3 మూవీస్ మిస్ కావొద్దు!

OTTలోకి 16 సినిమాలు.. వీకెండ్ కి ఈ 3 మూవీస్ మిస్ కావొద్దు!

Weekens OTT Suggestions: ఈ వారంలో ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు వరకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిలో ఈ మూడింటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

Weekens OTT Suggestions: ఈ వారంలో ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు వరకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిలో ఈ మూడింటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చే సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒక్కో వారం 20కి పైగా కూడా మూవీస్, వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ సినిమాలు చూడటం కుదరదు. అంత ఓపిక, తీరిక కూడా ఉండదు. కానీ, ఓటీటీల్లోకి వచ్చే అద్భుతమైన మూవీస్ ని మిస్ కావడం కూడా కరెక్ట్ కాదు. అందుకే మీకోసం ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ అయిన మూవీస్ లో బెస్ట్ 3 తీసుకొచ్చాం. ఈ వీకెండ్ కి మీరు ఎంచక్కా ఆ మూవీస్ చూసేసి ఎంజాయ్ చేయచ్చు. మరి.. ఆ మూవీస్ ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మలైకొట్టై వాలిబన్:

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలకు సౌత్ లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. తాజాగా మలైకొట్టై వాలిబన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. థియేటర్లో అయితే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ, ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, టేకింగ్ ని మాత్రం ఓటీటీలో తప్పకుండా చూడచ్చు. మిస్ అవ్వాల్సిన అవసరం లేదనే చెప్పాలి. పైగా మోహన్ లాల్ యాక్షన్ కూడా అందరినీ మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సదేహం లేదు. పైగా పిరయాడికల్ యాక్షన్ డ్రామా కాబట్టి ఈ మూవీని కచ్చితంగా ఈ వీకెండ్ కి చూడచ్చు అని చెప్పచ్చు. ఇప్పటికే ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

పోచర్ వెబ్ సిరీస్:

ఇప్పుడు వస్తున్న దాదాపుగా సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్లు యదార్థ కథనాల ఆధారంగానే తెరకెక్కుతున్నాయి. అలాంటి కోవలోకి వచ్చేదే ఈ పోచర్ వెబ్ సిరీస్. అభయారణ్యాలు, వన్య జీవుల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. కొన్నేళ్ల నుంచి అక్రమంగా, అతి కిరాతకంగా అడవుల్లో ఏనుగులను సంహరించడం, వాటితో ఇల్లీగల్ దందాలు చేయడం, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ వంటి సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఇలాంటి స్మగ్లింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీస్, ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు ఎంత కష్టపడుతున్నాయి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాళ్లు చేస్తున్న పోరాటలను ఈ వెబ్ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. థ్రిల్లర్, యాక్షన్ వెబ్ సిరీస్లు ఇష్టపడేవాళ్లు ఈ పోచర్ వెబ్ సిరీస్ ని కచ్చితంగా ఎంజాయ్ చేయగలగుతారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్:

నెట్ ఫ్లిక్స్ ప్రెజెంట్ చేస్తున్న అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ వెబ్ సిరీస్ మీద వరల్డ్ వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవతోంది. ఇప్పటికే అవతరా ది లాస్ట్ ఎయిర్ బెండర్ మూవీకి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇది వెబ్ సిరీస్ గా రాబోతుండటం.. అది కూడా అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యాధునిక టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్ వాడటం మరిన్ని అంచనాలను పెంచేసింది. అలాగే ఈ వెబ్ సిరీస్ కళ్లకు విజువల్ ఫీస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లలో ఈ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. ఈ మూవీ, వెబ్ సిరీస్ లను వీకెండ్ లో ఫినిష్ చేయాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments