Ondu Sarala Prema Kathe OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ondu Sarala Prema Kathe OTT Release: ఈ మధ్య కాలంలో భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు దుమ్మురేపుతున్నాయి.

Ondu Sarala Prema Kathe OTT Release: ఈ మధ్య కాలంలో భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు దుమ్మురేపుతున్నాయి.

టెక్నాలజీ మారుతున్నా కొద్ది ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ధియేటర్లలో పడిగాపులు పడుతూ అభిమాన హీరో సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు కొత్త సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, హర్రర్ జోన్, క్రైమ్ థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల కంటెంట్ తో ఉన్న మూవీస్, వెబ్ సీరీస్ లకు ఓటీటీలో మంచి ఆధరణ లభిస్తుంది. ధియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మైవీస్ ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ మధ్య కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఓ ఫీల్ గుడ్ లవ్, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది.. ఏ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చిందంటే..

ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచి వరుస లవ్ స్టోరీ మూవీస్ ఓటీటీలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ జాబితాలోనే ఉంది.. ‘ఒండ్రు సరళ ప్రేమ కథే’ మూవీ. లవ్, ఎమోషన్స్, కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్లు బాగా రాబట్టింది. తాజాగా ఒండ్రు సరళ ప్రేమ కథే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రిమింగ్ అవుతుంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ చిత్రం తెలుగు లో డబ్బింగ్ ఎప్పుడు వస్తుందన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ చిత్రంలో వినయ్ రాజ్ కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించగా, రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేష్ నిర్మించారు. వీర్ సామ్రాట్ మ్యూజిక్ అందించారు.

‘ఒండ్రు సరళ ప్రేమ కథే’ మూవీ కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు అతిశయ్ (వినయ్ రాజ్ కుమార్) మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే కోరికతో కొంతమంది వద్ద అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు. తాను కంపోజ్ చేసే పాటలకు మంచి సింగర్ కోసం ఎదురు చూస్తుంటాడు. అలా కలలో ఓ అమ్మాయి గొంతు వినిపిస్తుంది.. ఆ గొంతు మాధురి (మల్లికా సింగ్) గా భావిస్తాడు. అలా ఆమెను ఇష్టపడతాడు.. కానీ అంతలోనే ఓ ట్విస్ట్ జరుగుతుంది. మరి వీరిద్దరి ప్రేమ గెలుస్తుందా..? కథలో వచ్చే ట్విస్ట్ ఏంటీ? అనేది తెలుసుకోవాలంటే
‘ఒండ్రు సరళ ప్రేమ కథే’చూడాల్సిందే.

Show comments