ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.. నెలకు లక్షన్నర వరకు జీతం

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.. నెలకు లక్షన్నర వరకు జీతం

ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. డిగ్రీలు ఉండాల్సిన పనిలేదు. కేవలం ఇంటర్ పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే మళ్లీరాని ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం ట్రైనీ పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంటర్ అర్హతతో ట్రైనీ పైలట్ ఉద్యోగాలను పొందే ఛాన్స్. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు జూన్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ. 1.5 లక్షలకు పైగా ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ట్రైనీ పైలట్ పోస్టుల సంఖ్య:

  • 15

అర్హత:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాసై ఉండాలి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అందించిన వ్యాలీడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లేదా హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి.

వయో పరిమితి:

  • అభ్యర్థుల కనీస వయసు 20 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1.52 లక్షలు అందిస్తారు.

అప్లికేషన్ విధానం:

  • ఆఫ్‌ లైన్ లో అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోని, సరైన వివరాలను నమోదు చేసి‘లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసర్, న్యూఢిల్లీ-110003’ అడ్రస్‌కు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 10-06-2024
Show comments