Pic Talk: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు టాప్ హీరోయిన్! కాస్త ఆ క్రేజ్ ఎక్కువే!

ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు టాప్ హీరోయిన్! కాస్త ఆ క్రేజ్ ఎక్కువే!

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడో టాప్ హీరోయిన్. స్ట్రాంగ్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల హృదయాలను దోచేస్తుంది. కాస్త తెలుగు మూలాలున్న అమ్మాయి కూడా. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడో టాప్ హీరోయిన్. స్ట్రాంగ్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల హృదయాలను దోచేస్తుంది. కాస్త తెలుగు మూలాలున్న అమ్మాయి కూడా. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఇటీవల కాలంలో హీరోయిన్ స్ట్రాంగ్ రోల్స్ చేస్తున్నారు. కేవలం పాటలకు, నాలుగు సన్నివేశాలకు పరిమితం కావడం లేదు. స్క్రిప్ట్ నచ్చితే చిన్న పాత్ర అయినా సరే ఓకే చెబుతున్నారు. తమ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూస్తున్నారు. తమ నటనకు తగ్గ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఫైట్స్, యాక్టింగ్స్‌లో ఇరగదీస్తున్నారు. అంతేకాకుండా తోటి నటీమణులతో హెల్తీగా పోటీ పడుతూనే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వారి పుట్టిన రోజులకు విషెస్ చేసుకోవడం, కలిసి పార్టీలు, టూర్స్ వెళుతున్నారు.  ఇవన్నీ ఈ జనరేషన్ హీరోయిన్లకు సాధ్యం అని చెప్పొచ్చు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి కూడా.. ఈ జనరేషన్ హీరోయిన్నే. వచ్చిన చిన్న అవకాశాన్నైనా వదలకుండా.. తనను తాను ప్రతి సినిమాకు మెరుగులుదిద్దుకుంటూ స్టార్ నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతుంది.

ఈ ఫోటోలో అమ్మ పక్కన ఎంతో చక్కగా ఒదిగి కూర్చొన్న ఈ బ్యూటీ ఇప్పడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. యూత్ గుండెల్లో ఆమెకు కాస్త క్రేజ్ ఎక్కువే. కానీ స్టార్ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో బీగ్రేడ్ హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ..  ఏ గ్రేడ్ హీరోలతో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తెలుగులో ఇప్పటికే పది సినిమాలు చేసింది కానీ తగిన గుర్తింపు రాలేదు. ఒక్క సినిమా పడాలేగానీ బడా హీరోలు, నిర్మాతలు ఆమె కాల్షీట్లు కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. తెలుగు మూలాలున్న నివేదా పేతురాజ్. తమిళ్-తెలుగు మూలాలున్న తండ్రికి మధురైలో పుట్టింది ఈ అమ్మడు. 11 ఏళ్ల ప్రాయంలో దుబాయ్ వెళ్లిపోయింది వీరి కుటుంబం. చదువు పుర్తయ్యాక.. అందాల పోటీలకు ప్రిపేర్ అయ్యింది. 2015లో మిస్ ఇండియా యుఎఇ టైటిల్ గెలుచుకుంది.

2016లో వచ్చిన ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో నటనలోకి అడుగు పెట్టింది. 2017లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాలో స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో కనిపించింది. సాయి తేజ్, కల్యాణి ప్రియదర్శిన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రలహరిలో కూడా మంచి పాత్ర పోషించింది. బ్రోచెవారెవరురాలో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో.. సుశాంత్‌కు జోడిగా నటించింది. ఆ తర్వాత రెడ్, పాగల్, బ్లడ్ మ్యారీ, విరాట పర్వం, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ కమర్షియల్‌గా హిట్స్ .. కానీ ఆమెకు మాత్రం అవకాశాలు ఫట్. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. ఆమెకు ఉదయనిధి స్టాలిన్‌తో రిలేషన్ ఉందంటూ.. దుబాయ్‌లో రూ. 50 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నాడని శంకర్ అనే యూట్యూబర్ నోటికొచ్చినట్లు వాగడంతో నివేద ఇచ్చిపడేసింది.

Show comments