Om Bheem Bush Review: శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ!

Om Bheem Bush Review: శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ!

యంగ్ హీరో శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్​’తో మరోమారు ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ హీరో శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్​’తో మరోమారు ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Om Bheem Bush

20240322, U/A
Horror Comedy Drama
  • నటినటులు:Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Preity Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya menon, Racha Ravi
  • దర్శకత్వం:Sree Harsha Konuganti
  • నిర్మాత:Sunil Balusu
  • సంగీతం:Sunny M.R.
  • సినిమాటోగ్రఫీ:Raj Thota

3.25

ఒక్క సినిమాతోనే ఓవర్​నైట్ స్టార్ అయిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ శ్రీవిష్ణు మాత్రం అలా కాదు. ఒక్కో చిత్రంతో ఆడియెన్స్ మనసుకు చేరువ అవ్వాలని చూస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే మూవీస్​తో వాళ్ల ఇంట్లోని వ్యక్తిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కామెడీతో గిలిగింతలు పెడుతున్నారు. ఒక్కోసారి సెంటిమెంట్ పాత్రల్లో కనిపిస్తూ వాళ్లను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. గతేడాది వచ్చిన ‘సామజవరగమన’తో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. మరోమారు కామెడీ ఎంటర్​టైనర్​తో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఆయన నటించిన ‘ఓం భీం భుష్​’ తాజాగా రిలీజైంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్లు కష్టపడకుండానే లైఫ్​లో కింగ్​లా బతకాలని అనుకునే బ్యాచ్. లెగసీ యూనివర్సిటీలో వీళ్లు చదువుకుంటారు. అక్కడి ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) దగ్గర పీహెచ్​డీ చేయాలని అనుకుంటారు. అయితే ఈ ముగ్గురూ చేసే అల్లరి పనులు నచ్చక మధ్యలోనే వాళ్లను తరిమేస్తాడు ప్రొఫెసర్. దీంతో వినయ్ గుమ్మడి గ్రామం భైరవకొండకు వెళ్తూ అక్కడ పాడుపడిన ఓ బంగ్లాలో క్షుద్ర శక్తులు చేసే బైరాగి (షాన్ కక్కర్)ను చూస్తారు. అనంతరం సంపంగి అనే దెయ్యం ఉండే బంగ్లాలో నుంచి నిధులు తీసుకురావాలని సర్పంచ్, భైరాగులు ఛాలెంజ్ విసురుతారు. బంగ్లాలోకి వెళ్లిన ఆ ఫ్రెండ్స్​కు సంపంగి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? స్నేహితులు అంతా కలసి సంపంగిని శాంతింపజేశారా? సర్పంచ్ విసిరిన సవాల్ గెలిచి జలజ (ప్రీతి ముకుందన్)ను మ్యారేజ్ చేసుకున్నాడా? అనే క్వశ్చన్స్​కు ఆన్సర్సే ఈ సినిమా.

విశ్లేషణ:

యూనివర్సిటీ ప్రొఫెసర్​ తనను బాగా ఇబ్బంది పెట్టిన ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చెప్పడంతో స్టోరీ ఫ్లాష్ బ్యాక్​లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీన్ నుంచే హిలేరియల్ ఫన్ ఉంటుంది. ఎపిసోడ్స్​గా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ వేటికి అవే సూపర్బ్​గా వర్కౌట్ అయ్యాయి. మొదటి సీన్ నుంచి ఫన్ ఎలిమెంట్స్​తో పట్టాలెక్కిన ఫిల్మ్.. ఆ తర్వాత కామెడీ ట్రాక్​తో ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్విస్తుంది. దర్శకుడు రాసుకున్న ఎపిసోడ్స్​లో రెండు, మూడు మాత్రం ప్రేక్షకుల్ని సీట్ల మీద నుంచి లేచి నవ్వేలా చేస్తాయి. లాజిక్, అర్థం లేకపోయినా డైలాగ్స్ తెగ నవ్విస్తాయి. ఫన్​ రైడ్​తో ఫస్టాఫ్​ను ముగించిన డైరెక్టర్.. సెకండాఫ్​లో క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ప్యారలల్​గా ఎమోషనల్ ట్రాక్​ను కూడా నడిపిస్తూ ఆడియెన్స్​ మనసులను దోచుకున్నారు. చివర్లో పార్ట్​ 2కు లీడ్ ఇచ్చి ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేశారు.

నటీనటులు-టెక్నికల్ టీమ్ పనితీరు:

‘ఓం భీం బుష్​’కు అతిపెద్ద బలం శ్రీవిష్ణునే. ప్రతి సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఆయన. ఈ మూవీలో సర్​ప్రైజింగ్ యాక్టింగ్​తో ఆకట్టుకున్నారు. హ్యూమర్​ను పండించడంతో పాటు పాటు నటనకు అవకాశం దొరికిన ప్రతి చోట చెలరేగిపోయారు. తాను కంప్లీట్ యాక్టర్​ను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శికి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టినపిండి. వాళ్లు కూడా పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. రచ్చ రవి కూడా నవ్వులు పూయించారు.

ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ 100 పర్సెంట్ పర్ఫెక్షన్ చూపించారు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్​గా నిలిచింది. ఆర్డ్ డైరెక్టర్ శ్రీకాంత్ చిత్రం కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్​లో కనిపించింది. సన్నీ తన అద్భుతమైన మ్యూజిక్​తో సినిమాలోని చాలా సీన్స్​ను నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లారు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్​గా ఉన్నాయి. ఫన్, హ్యూమర్, ఎమోషన్స్​తో పకడ్బందీగా స్క్రిప్ట్​ను రాసుకొని అంతే బాగా సినిమాను తీసిన దర్శకుడు హర్ష మంచి మార్కులు కొట్టేశారు.

బలాలు:

  • శ్రీవిష్ణు
  • కామెడీ
  • డైలాగ్స్
  • మ్యూజిక్

బలహీనతలు:

  • అక్కడక్కడా స్లోగా సాగే సీన్స్
  • హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్

రేటింగ్:3.25/5

చివరిగా: ‘ఓం భీమ్ బుష్’ మూవీ ఒక హిలేరియస్ ఎంటర్​టైనర్.

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments