టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌పై కొత్త వివాదం! సౌత్‌ vs నార్త్‌..!

టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌పై కొత్త వివాదం! సౌత్‌ vs నార్త్‌..!

KL Rahul, Tilak Varma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మకు చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇది సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ ఫైట్‌గా మారింది.

KL Rahul, Tilak Varma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మకు చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇది సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ ఫైట్‌గా మారింది.

వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు 15తో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించారు. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హార్ధిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఈ జట్టును ప్రకటించారు. ఓ నలుగురు ప్లేయర్లను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. అయితే.. ఈ జట్టుపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం చెత్త ఫామ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేసి, సూపర్‌ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను పక్కనపెట్టారు. అందులోనూ దక్షినాది రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు అసలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్ టీమ్‌లో కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మకు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లకు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ, అనూహ్యంగా ఇద్దరిలో ఒక్కరి కూడా టీమ్‌లో చోటు దక్కలేదు. ఈ విషయం క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అస్సలు ఫామ్‌లో లేని హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లను ఎందుకు టీమ్‌లోకి తీసుకున్నారో అర్థం కావడం లేదని ఇది కేవలం ముంబై లాబి ఇండియన్‌ క్రికెట్‌ను నాశనం చేస్తోందని కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. పైగా హార్ధిక్‌ పాండ్యా లాంటి ఆటగాడు ఎప్పుడు గాయపడతాడో తెలియదని, అతన్ని నమ్మి.. టీమిండియా వరల్డ్‌ కప్‌ వెళ్తే.. కప్పు కొట్టడం అటుంచితే.. కనీసం గ్రూప్‌ స్టేజ్‌ కూడా దాటరంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ 40.60 యావరేజ్‌, 142.96 స్ట్రైక్‌రేట్‌తో 406 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 37.75 యావరేజ​, 139.12 స్ట్రైక్‌ రేట్‌ ఉంది. 72 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అలాగే తిలక్‌ వర్మ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 42.88 యావరేజ్‌, 153.81 స్టైక్‌రేట్‌తో 343 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. పైగా గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌ భారాన్ని తిలక్‌ వర్మ తన భుజాలపై మోస్తున్నాడు. టీమ్‌ కష్టాల్లో ఉన్న ప్రతి సారి.. తానే పెద్ద దిక్కుగా నిలుస్తూ.. ప్రెజర్‌ను అద్భుతంగా హ్యాండిల్‌ చేస్తున్నాడు. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో తిలక్‌ లాంటి యువ ఆటగాళ్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. పైగా తిలక్‌ తెలంగాణ రాష్ట్రానికి, కేఎల్‌ రాహుల్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావడంతో సౌత్‌ ఇండియా ఆటగాళ్లపై బీసీసీఐకి ఇంత చిన్న చూపు ఎందుకంటూ క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments