iDreamPost
iDreamPost
ఎల్లుండి విడుదల కాబోతున్న పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త మూవీ కడువా మీద పెద్ద అంచనాలేం లేవు కానీ టాక్ ని నమ్ముకుని బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. దానికి తోడు పెద్దగా పోటీ లేకపోవడం కలిసొస్తుందనే కాన్ఫిడెన్స్ టీమ్ లో కనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే తప్ప బరిలో ఉన్నవన్నీ ప్రేక్షకుల దృష్టిలో అంతగా లేని చిన్న సినిమాలే. డబ్బింగ్ మూవీ కాబట్టి కడువా బిజినెస్ తక్కువకే చేశారు.
Kaduva movie కడువా రిపోర్ట్
ఇదంతా ఓకే కానీ కడువా మలయాళం టైటిల్ యధాతథంగా తెలుగులో అలాగే ఉంచేయడం పట్ల భాషాభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంత అది పాత్ర పేరు అయినప్పటికీ ఆ కోణంలో సమర్ధించుకోవడం కరెక్ట్ కాదు. కడువ అంటే పులి అని అర్థం. అదేదో దాన్నే పేరుగా పెట్టినా సరిపోతుంది. పృథ్విరాజ్ ఇటీవలే ప్రెస్ మీట్ లో ఏదో కవర్ చేయబోయారు కానీ సింక్ అవ్వలేదు.
నిజానికి ఈ తెలుగుని అవమానపరిచే ట్రెండ్ సినిమాల నుంచి వెబ్ సిరీస్ లకు పాకింది. తలైవి, వలిమై, సుడల్ ఇలా ఏది తీసుకున్నా అన్నిటిది ఒకటే తంతు. అదే మనవి తీసుకెళ్లి యధాతథంగా అక్కడ పెడితే అంగీకరించే పరిస్థితి తర్వాత ముందు కనీసం పోస్టర్ వైపు కూడా చూడరు. మనవాళ్ళు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఈ రుద్దుడుని అలవాటు చేసుకునే పనిలో ఉన్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ టైటిల్స్ వల్లే తమిళ మలయాళ బాషలను టాలీవుడ్ ఆడియన్స్ నేర్చేసుకున్నా ఆశ్చర్యం లేదు