iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని ఖర్చు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా మొదలుకాకపోవడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.. ఇంతే టైం త్యాగం చేసిన రామ్ చరణ్ మరోవైపు వేగంగా ప్రాజెక్టులు ఒప్పుకుని షూటింగులు చేస్తుంటే తమ హీరో మాత్రం మౌనంగా ఉండటం వాళ్ళు జీరించుకోలేకపోతున్నారు. కొరటాల శివతో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. అసలు ఎప్పుడో కూడా ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 29 విడుదల కాబోతున్న చిరంజీవి ఆచార్య తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్ల కొరటాల ఇటువైపు రాలేకపోతున్నాడని ఫిలిం నగర్ టాక్.
అంటే ఈ లెక్కన ఇంకో నెల దాకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్టే. అప్పటిదాకా జూనియర్ ఖాళీగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు. ఎవరు మీలో కోటీశ్వరుడు షో చేసినా అది మరీ అద్భుతాలు చేయలేకపోయింది. పైగా టీవీ షోలతో ఫ్యాన్స్ సంతృప్తి చెందరు. వాళ్లకు సినిమాలే కావాలి. సరే కొరటాల శివది ఇంకొంత ఆలస్యమవుతుందనే అనుకుందాం. పోనీ తారక్ తర్వాత ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా రాలేదు. ప్రశాంత్ నీల్ ఉన్నాడు కానీ అది ఈ ఏడాదా లేక వచ్చే సంవత్సరమా అనేది ఆ ఇద్దరికే తెలుసు. ఇంతటి గ్యాప్ ని, అయోమయ పరిస్థితిని జూనియర్ ఎన్టీఆర్ లో కెరీర్ లో ఎప్పుడూ చూడలేదన్నది వాస్తవం.
బాహుబలి చేసినప్పుడు ప్రభాస్ సైతం ఇదే ఇబ్బంది పడ్డాడు కానీ దాని సక్సెస్ అతన్ని నేషనల్ స్టార్ ని చేసింది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ అదే స్థాయి ఫలితాన్ని అందుకున్నా రిజల్ట్ ని రామ్ చరణ్, రాజమౌళితో కలిసి షేర్ చేసుకోవాలి. దీని వల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువా తక్కువా అనేది మార్చ్ 25 తర్వాతే తెలుస్తుంది. అంతకన్నా ముందుగా అంచనా వేయలేం. ట్రిపులార్ చేస్తున్న సమయంలో తారక్ కాస్త జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుని ఉంటే ఇప్పుడిలా అయ్యేది కాదని విశ్లేషకుల అంచనా. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న హీరోకు ఇంతేసి గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం
Also Read : Adipurush :10 నెలల ముందే ప్రభాస్ టీమ్ జాగ్రత్త