షాకింగ్.. విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. 11 ఏళ్ల దాంపత్యానికి గుడ్ బై!

షాకింగ్.. విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. 11 ఏళ్ల దాంపత్యానికి గుడ్ బై!

సినీ ఇండస్ట్రీనీ ఓ షాకింగ్ న్యూస్ షేక్ చేస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తన 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు. ఇతడి భార్య కూడా సింగరే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీనీ ఓ షాకింగ్ న్యూస్ షేక్ చేస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తన 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు. ఇతడి భార్య కూడా సింగరే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్ర పరిశ్రమను ఓ షాకింగ్ న్యూస్ షేక్ చేస్తోంది. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 11 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ విషయంలో మీడియా, ఫ్రెండ్స్ మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఆమె కూడా సింగరే కావడం గమనార్హం. మరి విడాకులు తీసుకుంటున్న ఆ ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరు? డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా ఓ స్టార్ మూజిక్ డైరెక్టర్, అతని భార్య విడిపోతున్నట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కానీ ఆ వార్తలను సినీ ప్రముఖులు కొట్టిపారేశారు. అయితే ఆ వార్తలే నేడు నిజం అయ్యాయి. విడాకులు తీసుకోబోయేది మరెవరో కాదు.. ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. ఈ విషయాన్ని జీవీ ప్రకాశ్ అతడి భార్య సింగర్ సైంధవి ఇద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సంఘటన సినీ పరిశ్రమనే దిగ్బ్రాంతికి గురిచేసింది.

“మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, అవి పరిష్కరించుకోలేని విధంగా ఉండటంతో.. మానసిక ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. మా 11 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నాం. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం. మీడియా, ఫ్రెండ్స్ మా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాము” అని ఇద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇక వారి దాంపత్య విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ కుమార్-సైంధవి చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఒకే స్కూల్ లో క్లాస్ మెంట్స్ కూడా. పెరిగి పెద్దవారు అయ్యే క్రమంలోవారి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో ఇరు కుటుంబాలకు విషయం చెప్పి 2013లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా ఉండాలని ఇద్దరూ వేడుకున్నారు. మరి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్-సింగర్ విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments