ముక్కు అవినాష్ ఎమోషనల్.. డాక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నానంటూ..!

Avinash: ముక్కు అవినాష్ ఎమోషనల్.. డాక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నానంటూ..!

జబర్దస్త్ షో పుణ్యమా అని చాలా మంది తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ముక్కు అవినాష్ కూడా ప్రేక్షకులలో అంతే ఫేమస్ అయ్యాడు. అయితే, తాజాగా అవినాష్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నాడు.

జబర్దస్త్ షో పుణ్యమా అని చాలా మంది తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ముక్కు అవినాష్ కూడా ప్రేక్షకులలో అంతే ఫేమస్ అయ్యాడు. అయితే, తాజాగా అవినాష్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నాడు.

అవినాష్ ఈ పేరుతో ఈ వ్యక్తిని గుర్తుపట్టడం కాస్త కష్టమే.. కానీ ముక్కు అవినాష్ అని చెప్తే మాత్రం అందరు యిట్టె గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ షో పుణ్యమా అని.. ఎంతో మంది ఫేమస్ అవుతూ వస్తున్నారు. అలానే అవినాష్ కూడా జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకుని.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత చాలా టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ.. అందరిని నవ్విస్తూ ఉంటాడు. అయితే ఆ నవ్వుల వెనుక ఉన్న బాధను మాత్రం ఎవరికీ కనిపించనివ్వడు. తాజాగా అవినాష్ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నాడు. దీనితో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

కమిడియన్ గా బుల్లి తెరపై నటించిన అవినాష్ ఇక ఇప్పుడిప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తున్నారు. అయితే ఎంత ఫేమస్ వ్యక్తి అయినా కూడా సినిమా ఛాన్స్ రావడం అంటే మాత్రం అంత ఈజీ కాదని.. అవినాష్ మాటలు వింటూనే అర్థమౌతూ ఉంటుంది. తాజాగా అవినాష్ తనకు సినిమా ఆఫర్లు ఎలా వచ్చాయనే విషయాన్నీ చెప్తూ.. “నేను ఇప్ప‌టికీ సినిమా ఆఫీస్ ల‌కి వెళ్తుంటాను. ఎంతో కొంత పేరు వ‌చ్చింద‌ని ఇంట్లోనే కూర్చుని ఉండ‌లేం. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వ‌చ్చేశారు. మ‌నం ఇంట్లో కూర్చుంటే, గ్యాప్ వ‌చ్చేస్త‌ది. అందుకే, డైరెక్ట‌ర్ల‌కి, కో – డైరెక్ట‌ర్ల‌కి, మేనేజ‌ర్ల‌కి కాల్ చేస్తూ ఉంటాను. నేను అడుగుతాను వాళ్ల‌ని. కానీ, కొంత‌మంది మాత్రం అవినాష్ కోసం క్యారెక్ట‌ర్ రాద్దాం అని రాస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.. అలాగే ఒక సినిమాలో పెద్ద క్యారెక్ట‌ర్ ఇచ్చి త‌ర్వాత ఫోన్ ఎత్త‌లేదు డైరెక్ట‌ర్. బెల్లం కొండ సాయిగారి సినిమాలో చాలా పెద్ద క్యారెక్ట‌ర్ మిస్ అయ్యింది.

ఆ డైరెక్ట‌ర్ నాకు చాలా క్లోజ్ ఇద్ద‌రం క‌లిసి ట్రావెల్ చేశాం. ఆ క్యారెక్ట‌ర్ క‌చ్చితంగా నువ్వే చేయాలి అన్నాడు. షెడ్యూల్ కి కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు షూటింగ్ కి వెళ్లాలి. కానీ, ఒక్క‌సారిగా అత‌ను ఫోన్ లిఫ్ట్ చేయ‌లేదు. ఎందుకంటే.. ప్రొడ్యూస‌ర్ ద్వారా ఆ క్యారెక్ట‌ర్ వేరే వాళ్ల‌కి వెళ్లిపోయింది. జ‌బ‌ర్ద‌స్త్ కి ముందు నేను ఎవ్వ‌రికీ తెలీదు. ఆ త‌ర్వాతే అంద‌రికీ తెలిసింది. 2009లో స్టార్ట్ చేస్తే 2014లో ఛాన్స్ వ‌చ్చింది. అంత‌కు ముందు చాలా అంటే చాలా క‌ష్టాలు ప‌డ్డాం. తినేందుకు తిండి ఉండేది కూడా కాదు. నెత్తికి పెట్టుకునే కొబ్బ‌రి నూనెతో వంట చేసుకుని తినేవాళ్లం. దొంగ‌త‌నంగా చాలా పెళ్లిల‌కి వెళ్లి తిన్నాం. అలా ఆక‌లి తీర్చుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. అలాగే… తన వ్యక్తి గత జీవితంలో ఈ ఇటీవల జరిగిన ఓ విషాద సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. దానికి సంబంధించి అవినాష్ మాట్లాడుతూ..

“తెల్లారితే నా భార్య డెలివ‌రీ. కానీ, ముందు రోజు రాత్రి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఉమ్మ‌నీరు త‌గ్గిపోవ‌డం లాంటివి జ‌రిగాయి. డాక్ట‌ర్స్ కి కూడా స‌రైన రీజ‌న్ తెలీదు. హాస్పిట‌ల్ కి వెళ్లి డాక్ట‌ర్ కాళ్ల మీద ప‌డ్డాను. ఎలాగైన బ‌తికించండి అని వేడుకున్నాను. అర్ధ‌రాత్రి రోడ్డు మీద ప‌డి ఏడుస్తూ తిరిగాను.క ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొంచెం టైం ప‌ట్టింది మాకు. వీళ్లంతా స‌పోర్ట్ ఇచ్చారు. బ్లెసింగ్స్ ఇచ్చారు. చాలా క‌ల‌లు క‌న్నాము. కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలి? కూతురు పుడితే ఏ పేరు పెట్టాలి? అని చాలా అనుకున్నాం. కానీ, అలా జ‌రిగిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. ఏదేమైనా తెరపైన నవ్వుతూ.. నవ్విస్తూ కనిపించే వాళ్ళకి కూడా తెరవెనుక చాలానే కష్టాలు ఉంటాయని మరొక సారి అందరికి తెలియజేసినట్లైంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments