New Fraud In Coconut Water Kobbari Bondam Business: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? మీరు మోసపోతున్నట్టే! వెలుగులోకి నయా దందా!

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? మీరు మోసపోతున్నట్టే! వెలుగులోకి నయా దందా!

Coconut Water: వేసవిలో ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. అది కూడా బొండాం బదులు.. బాటిల్‌లో నీరు కొట్టించుకుని తీసుకెళ్తున్నారా.. అయితే మీరు భారీగా మోసపోతున్నట్లే. ఎలాగంటే.

Coconut Water: వేసవిలో ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. అది కూడా బొండాం బదులు.. బాటిల్‌లో నీరు కొట్టించుకుని తీసుకెళ్తున్నారా.. అయితే మీరు భారీగా మోసపోతున్నట్లే. ఎలాగంటే.

కొబ్బరి బొండాం.. ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం. మిగతా కాలాలతో పోలిస్తే.. వేసవిలో కొబ్బరి బొండాలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. దాంతో ధర కూడా భారీగానే పెరుగుతుంది. ఇక కొబ్బరి నీళ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడేవారికి.. వేడి చేసిన వారికి కొబ్బరి నీరు మంచి మెడిసిన్‌ అన్నమాట. ఇక వేసవి తాపం నుంచి తప్పించుకోవడం కోసం ఎండాకాలంలో రోజు కొబ్బరి బొండాం తాగుతారు కొందరు. అయితే వేసవిలో కొబ్బరి బొండాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. లీటర్‌ నీటిని 140 రూపాయలకు అమ్ముతారు. ఒక్క బొండానికి రూ.70 తీసుకుంటారు. బొండాలు కొట్టించుకుని తాగితే పర్లేదు. కానీ లీటర్‌ చొప్పున తీసుకుంటే మాత్రం.. భారీగా నష్టపోతారని.. మీరు ఏం ఆశించి కొబ్బరి నీళ్లు తీసుకుంటున్నారో ఆ ప్రయోజనాలు కలగకపోగా.. మరిన్ని సమస్యలు వస్తాయిని అంటున్నారు నిపుణులు. కొబ్బరి బొండాం బిజినెస్‌లో సాగుతున్న నయా దందాను కొందరు తాజాగా బయటపెట్టారు. ఆ వివరాలు..

ఈ వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి మంచిదని.. దీని వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని నమ్ముతారు. వైద్యులు కూడా కూల్‌డ్రింక్స్‌ బదులు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలని చెబుతుంటారు. మిగతా సీజన్లలో కొబ్బరి బొండాలకు బాగా డిమాండ్‌ ఉంటే.. వేసవిలో మాత్రం ఎక్కువగా కొబ్బరి నీళ్లను లీటర్ల రూపంలో కొనుగోలు చేస్తారు.

అయితే ఇక్కడే భారీ మోసం జరుగుతుందని అంటున్నారు కొందరు. సాధారణంగా వేసవిలో కొబ్బరి బొండాలకు ధర భారీగా ఉంటుంది. ఒక్కో కాయ 70 రూపాయలు కూడా పలుకుతుంది. అదే లీటర్‌ వాటర్‌ అయితే 120-140 రూపాయలు ఉంటాయి. దాంతో చాలా మంది కుటుంబ సభ్యులందరూ తాగొచ్చు అనే ఉద్దేశంతో లీటర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అయితే కొబ్బరి బొండాం తాగితే లేత కాయ తాగాలి. దానిలో ఉండే నీరు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. కానీ లీటర్‌ చొప్పున కొనుగోలు చేసే సమయంలో.. కొబ్బరి బొండాలు అమ్మే వారు.. లేత కాయలు కాకుండా.. ముదురు వాటిని, ఎండకు వాడి పోయిన కాయలు కొడతారని.. అలాంటి కాయల్లో ఉండే నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు లేకపోగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అందుకు ఇలా లీటర్ల రూపంలో కొబ్బరి నీరు కొనుగోలు చేసే బదులు.. డబ్బులు ఎక్కవైనా పర్లేదు.. లేత కాయలు కొట్టించుకుని నీరు తీసుకోవడం, అవే నీరు తాగడం మంచిది అని సూచిస్తున్నారు. ఇకపై కొబ్బరి నీరు తాగే సమయంలో దీన్ని గమనించి.. మంచి నిర్ణయం తీసుకొండి అంటున్నారు.

Show comments