Nara Lokesh: పవన్ జాతకం చంద్రబాబు నిర్ణయిస్తాడట.. జనసేనకు లోకేశ్ మరో ఝలక్!

Nara Lokesh: పవన్ జాతకం చంద్రబాబు నిర్ణయిస్తాడట.. జనసేనకు లోకేశ్ మరో ఝలక్!

ఏపీలో మరోసారి వైసీపీదే హవా.. జగనే మళ్లీ సీఎం అని సర్వేలన్ని నొక్కి చెబుతున్నాయి. ఇటు చూస్తేనేమో పవన్ ని ఓడిస్తామన్న టీడీపీ-జనసేన ఇంకా సీట్ల కేటాయింపు దగ్గరే ఆగిపోయింది. కానీ ఈలోపే నారా లోకేష్ చేస్తోన్న వ్యాఖ్యలు.. ఒకవేళ కూటమి గెలిస్తే.. పవన్ కళ్యాణ్, జనసేన పరిస్థితి ఏంటో ముందుగానే చెప్పి పార్టీ నేతలకు భారీ షాక్ ఇస్తున్నాడు. ఆ వివరాలు..

ఏపీలో మరోసారి వైసీపీదే హవా.. జగనే మళ్లీ సీఎం అని సర్వేలన్ని నొక్కి చెబుతున్నాయి. ఇటు చూస్తేనేమో పవన్ ని ఓడిస్తామన్న టీడీపీ-జనసేన ఇంకా సీట్ల కేటాయింపు దగ్గరే ఆగిపోయింది. కానీ ఈలోపే నారా లోకేష్ చేస్తోన్న వ్యాఖ్యలు.. ఒకవేళ కూటమి గెలిస్తే.. పవన్ కళ్యాణ్, జనసేన పరిస్థితి ఏంటో ముందుగానే చెప్పి పార్టీ నేతలకు భారీ షాక్ ఇస్తున్నాడు. ఆ వివరాలు..

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనాలందరూ మరో సారి జగనే మా సీఎం అని ముక్త కంఠంతో చెబుతున్నారు. సర్వే ఫలితాలన్ని కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసే వ్యాఖ్యలు చూసి ఆ పార్టీ నేతలే తల బాదుకుంటున్నారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలసిందే. రెండు పార్టీల పొత్తు గురించి స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. రాజమండ్రీ సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించాడు. అయితే పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచే జనసేన కార్యకర్తలు, నాయకులు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో.. టీడీపీ, జనసేన నేతలు తన్నుకుంటున్నారు. వీటికి తోడు లోకేష్.. నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ.. సమస్యను మరింత పెంచుతున్నాడు అని టీడీపీ నేతలే అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు చాలా మంది జనసైనికులు, నేతలకు నచ్చలేదు. మద్దతిచ్చిన వాళ్లు కూడా.. ఒకవేళ ఎన్నికల్లో కూటమి గెలిస్తే.. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతోనే పొత్తును స్వాగతిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే.. సీఎం పదవిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెరో రెండున్నర ఏళ్లు పంచుకుంటారని వారంతా భావిస్తున్నారు.

దీనికి తగ్గట్టుగానే గతంలో పవన్ కూడా అనే సందర్భాల్లో.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ అనేక బహిరంగ సభల్లో ప్రకటించాడు. దాంతో పొత్తు గురించి ప్రకటన రాగానే చాలా మంది జనసేన కార్యకర్తలు.. పవన్ కూడా సీఎం పదవి గురించి అడిగి ఉంటారు.. అందుకు చంద్రబాబు అంగీకరించి ఉంటారు.. అందుకే పొత్తుకు ఆమోదం తెలిపారని భావించారు. ఇన్నాళ్లుగా అలానే ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో జనసైనికులకు ఊహించని షాక్ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒకవేళ కూటమి విజయం సాధిస్తే.. ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు.. సీఎం పదవి షేరింగ్ ఉండదని తేల్చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్న జనసైనికులు ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పాడు. డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ కు ఇస్తారా అని ప్రశ్నిస్తే.. ఆ విషయం చంద్రబాబు, పవన్, పోలీట్ బ్యూరో నిర్ణయిస్తారని చెప్పాడు తప్పా.. అవునని అంగీకరించలేదు.

ఈ వీడియో చూసిన జనసైనికులు మరింత ఆందోళన చెందుతన్నారు. జనసేనకు పదవులు ఇచ్చే ఆలోచన టీడీపీ నేతల్లో లేదని లోకేష్ మాటల్ని బట్టి అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి అనే మాట పూర్తి కాకముందే చంద్రబాబు నాయుడు అన్న లోకేష్.. ఉప ముఖ్యమంత్రి సీటు పవన్ కే అని చెప్పలేకపోతున్నాడంటేనే.. వారి దృష్టిలో అతడి విలువ ఏంటో అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ పండితులు.

జనసేన కార్యకర్తలు సైతం లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి టీడీపీకి జనసేన సాయం కావాలి.. కానీ పదవుల విషయానికి వస్తే.. మా పార్టీ వారి కళ్లకు కనిపించడం లేదా.. ఇలాంటి అవమానాలు పొందడానికేనా టీడీపీతో పొత్తు కోరుకుంటుంది.. దీని కన్నా ఒంటరిగా పోటీ చేసి.. ఓడిపోయినా వేయి పాళ్లు నయమే కదా అని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీతో కన్నా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు అన్ని విధాల కలిసి వస్తుందని.. గౌరవంగా కూడా ఉంటుందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. లోకేష్ ఇంతలా రెచ్చిపోతున్నా.. పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. పవర్ షేరింగ్ లేకుంటే.. కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుంది. అప్పుడే టీడీపీకి మన విలువ తెలిసి వస్తుంది.. ఎన్నికల్లో తెలుగు దేశం ఎలాను ఓడిపోతుంది.. మనకు ఓ అవకాశం దొరుకుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు జన సైనికులు.

ఇక ఈ అంశంపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు. ఇదిలా ఉంటే.. గెలిచే అవకాశమే లేకున్నా.. టీడీపీ, జనసేన నేతలు సీఎం సీటు గురించి కొట్టుకోవడం చూసి సామాన్య జనాలు సైతం నవ్వుకుంటున్నారు. అంటే పవన్ జాతకం చంద్రబాబు నిర్ణయిస్తాడన్నమాట అని ఎద్దేవా చేస్తున్నారు.

Show comments