నాగ చైతన్యకు సుష్మిత అంటే క్ర‌ష్, స‌మంత‌కు ర‌ణ‌వీర్, సారాకు విజ‌య్, హాట్ సెలబ్రిటీ క్రష్‌ల గురించి మీకెంత తెలుసు?

నాగ చైతన్యకు సుష్మిత అంటే క్ర‌ష్, స‌మంత‌కు ర‌ణ‌వీర్, సారాకు విజ‌య్, హాట్ సెలబ్రిటీ క్రష్‌ల గురించి మీకెంత తెలుసు?

అంద‌రికీ ఎవ‌రో ఒక‌రంటే బాగా ఇష్టం. బాలీవుడ్ సెల‌బ్రిటీలూకూడా కొంద‌రంటే చాలా క్ర‌ష్. సినిమావాళ్లుకాబ‌ట్టి, సూప‌ర్ స్టార్ల మీదే మోజెక్కువ‌.

నాగ చైతన్య Naga Chaitanya
లాల్ సింగ్ చద్దా స్టార్ నాగ చైతన్యకు మొదటి సెలబ్రిటీ క్రష్ సుస్మితా సేన్ అంట‌. సుస్మితను కలుసుకున్నాడు, తన క్రష్ గురించి చెప్పాడు. అదికూడా త‌న తండ్రి సినిమాలో సుస్మిత యాక్ట్ చేస్తున్న‌ప్పుడు. కత్రినా కైఫ్ అందంగా ఉందని చెప్పాడు. ఇప్ప‌టికి చాలామందితో యాక్ట్ చేసినా, సుస్మితా సేన్ అంత క్ర‌ష్ పుట్ట‌లేద‌ని అంటాడు.

సమంత Samantha Ruth Prabhu
నాగ చైత‌న్య‌కు సుస్మితా సేన్ క్ర‌ష్ అయితే, అత‌ని మాజీ భార్య స‌మంత‌కు రణ్‌వీర్ సింగ్ ఒక హాటీలా క‌నిపిస్తాడు. నటి దీపికా పదుకొణెని వివాహం చేసుకున్న ఈ సూప‌ర్ స్టార్ అంటే, సమంతకు విపరీతమైన ప్రేమ, కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో, సమంతా తన క్ర‌ష్ గురించి బైట‌పెట్టేసింది. ఇప్పుడు ర‌ణ్ వీర్ సింగ్ తో క‌ల‌సి న‌టిస్తోంది.

అనన్య పాండే Ananya Panday
షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పాపులర్ స్టార్ కిడ్. కింగ్ ఖాన్ కొడుకు కావ‌డంవ‌ల్ల అనండి, అత‌ని యాటిట్యూడ్ అనండి. అత‌నికోసం వెర్రెత్తిపోయే ఆడ‌వాళ్లు, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. లేటెస్ట్ గా కాఫీ విత్ కరణ్ 7లో, లైగర్ హీరోయిన్ అన‌న్య‌పాండే, ఆర్యన్ అంటే చాలా క్ర‌ష్ అని చెప్పింది. వారిద్ద‌రూ డేట్ చేస్తే, బాలీవుడ్ మ‌రో ప్రేమ‌పురాణం దొరికిన‌ట్లే.

సారా అలీ ఖాన్ Sara Ali Khan
ఇప్పుడు ఈ జోడి ముంబైలో హాటెస్ట్ జంటలలో ఒకటిగా మారనుంది. లిగర్ స్టార్ విజయ్ అంటే పిచ్చి ప్రేమ ఉంద‌ని , అతనితో డేటింగ్ చేయాలనుకుంటున్నాను అని సారా చెప్పింది. విజ‌య్ కూడా రెడీ. ఈ లెక్క‌న మ‌రో డేటింగ్ గాసిప్స్ కోసం రెడీగా ఉండండి.

జాన్వీ కపూర్ Janhvi Kapoor
మిస్టర్ ఖన్నాకు మహిళా అభిమానులెక్కువ‌. వాళ్ల‌కి ఖ‌న్నా కంటికి మిఠాయి లాంటివాడు. జాన్వీ కపూర్ కూడా రాహుల్ ఖన్నాను సూపర్ హాట్‌గా పిలిచింది. కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఇంకో మాట‌కూడా చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌ని వెంట‌ప‌డిందంట‌. అత‌నితో డేటింగ్? ఈ సంగ‌తి ఇంకా తెలియదు.

పరిణీతి చోప్రా Parineeti Chopra
అదేంటో పరిణీతి చోప్రాకు పెళ్ల‌యిన‌ సైఫ్ అలీ ఖాన్ అంటే విప‌రీత‌మైన పిచ్చి. అత‌ని గురించి మీరు క‌ద‌పండి, గంట‌ల కొద్దీ మాట్లాడేస్తుంది. భర్తగా పొందడం కరీనా కపూర్ అదృష్టమని కూడా చెప్పింది. డౌట్ ప‌డొద్దు. ఈ క్రేజీ క్రష్ గురించి బెబోకు బాగా తెలుసు. అందుకే ప‌రిణితిని ఇష్ట‌ప‌డుతుంది.

Show comments