Virat Kohli Warning To Wriddhiman Saha: వీడియో: నిన్న మ్యాచ్​లో అందరూ మిస్సైన సీన్.. సాహాను ఆడుకున్న కోహ్లీ!

RCB vs GT: వీడియో: నిన్న మ్యాచ్​లో అందరూ మిస్సైన సీన్.. సాహాను ఆడుకున్న కోహ్లీ!

ఆర్సీబీ విజయాల జోరు ఆగడం లేదు. వరుసగా రెండు విక్టరీలు కొట్టిన బెంగళూరు.. నిన్న గుజరాత్ టైటాన్స్​ను కూడా మట్టికరిపించింది.

ఆర్సీబీ విజయాల జోరు ఆగడం లేదు. వరుసగా రెండు విక్టరీలు కొట్టిన బెంగళూరు.. నిన్న గుజరాత్ టైటాన్స్​ను కూడా మట్టికరిపించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆలస్యంగా ఊపులోకి వచ్చింది. వరుసగా ఆరు పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసులో నుంచి టెక్నికల్​గా తప్పుకున్న డుప్లెసిస్ సేన.. ఆ తర్వాత నుంచి సక్సెస్ బాట పట్టింది. బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్​లతో అభిమానుల్లో జోష్ నింపిన ఆర్సీబీ.. నిన్న గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ దుమ్మురేపింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన జీటీ 19.3 ఓవర్లకు 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బెంగళూరు 13.4 ఓవర్లలోనే ఆ టార్గెట్​ను రీచ్ అయింది. అయితే నిన్న మ్యాచ్​లో ఓ సీన్​ను అందరూ మిస్సయ్యారు. గుజరాత్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాను విరాట్ కోహ్లీ ఓ ఆటాడుకున్నాడు.

ఆర్సీబీ ఇన్నింగ్స్ టైమ్​లో సాహాకు కోహ్లీ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. అప్పటికే డుప్లెసిస్ సేన 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసేసింది. విజయానికి మరో 78 బంతుల్లో 48 పరుగులు చేయాలి. కోహ్లీతో పాటు రజత్ పాటిదార్ క్రీజులో ఉన్నాడు. మ్యాచ్ గుజరాత్ చేతుల్లో నుంచి దాదాపుగా జారిపోయింది. ఈ తరుణంలో సాహా తమ జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడు. పరుగులు ఆపాలి, మ్యాచ్​ను మన వైపు లాక్కోవాలి అంటూ ప్రోత్సహిస్తూ కనిపించాడు. ఈ వ్యాఖ్యల్ని విన్న కోహ్లీ అంత ఈజీగా ఎలా లాగుతావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎలా ఓడిస్తారో చూసుకుందాం అంటూ సవాల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది మ్యాచ్​కే హైలైట్ అనే చెప్పాలి.

సాహాకు వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే కోహ్లీ ఔట్ అయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్​లో సాహాకే క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరగడం గమనార్హం. 14 పరుగుల వ్యవధిలో విరాట్ (27 బంతుల్లో 42)​తో పాటు పాటిదార్ (2), గ్లెన్ మాక్స్​వెల్ (4), కామెరాన్ గ్రీన్ (1) పెవిలియన్​కు చేరారు. దీంతో ఆర్సీబీ లక్ష్యాన్ని అందుకుంటుందా అనే అనుమానాలు వచ్చాయి. అయితే దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15) టీమ్​ను విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్​లో 2 వికెట్లతో అదరగొట్టిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

Show comments