Murali Mohan About Uday Kiran: ఉదయ్ కిరణ్‌ని ఆ డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం.. మొత్తం బయట పెట్టిన మురళి మోహన్!

ఉదయ్ కిరణ్‌ని ఆ డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం.. మొత్తం బయట పెట్టిన మురళి మోహన్!

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ మృతిని అతడి అభిమానులు నేటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా మురళి మోహన్‌ దీనిపై మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ మృతిని అతడి అభిమానులు నేటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా మురళి మోహన్‌ దీనిపై మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసే వాళ్లకి ఇక్కడ నేము, ఫేము, క్రేజు మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడి వారు అనుభవించే బాధలు, కష్టాల గురించి పెద్దగా తెలియదు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు.. అక్కడ నుంచి బయటకు రాలేరు.. అక్కడే ఉండి పోలేరు. అవకాశాలు లేక.. సాధారణ జీవితం గడపలేక సతమతమవుతుంటారు. కొందరైతే ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు సైతం తీసుకుంటారు. ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. మరెంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన స్టార్లు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడి అభిమానులని శోక సంద్రంలో ముంచుతారు. ఇక టాలీవుడ్‌లో ఇలాంటి విషాదాంతాల్లో ఎప్పటికి మరుపురాని ఘటన ఉదయ్‌ కిరణ్‌ది.

ఉదయ్‌ కిరణ్‌ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. ఎంతో కష్టపడి.. పైకి వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన ఉదయ్‌ కిరణ్‌.. ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటికి కూడా అభిమానులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య గురించి అనేక మంది అనేక కారణాలు చెప్తారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ నటుడు మురళి మోహన్‌.. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య గురించి సంచలన నిజాలు బయట పెట్టారు. ఆ వివరాలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్‌.. ఉదయ్‌ కిరణ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ దివంగత నటుడి జీవితంలో ఏం జరిగింది అని యాంకర్‌ ప్రశ్నించగా.. మురళి మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఉదయ్‌ కిరణ్‌కి హైపర్‌ టెన్షన్‌ సమస్య. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్‌ పడేవాడు. నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. అతడి సమస్య గురించి తెలుసుకుని ఓ డాక్టర్‌ దగ్గర జాయిన్‌ చేశాం. బీపీ వచ్చినప్పుడు మనిషి కంట్రోల్‌లో ఉండటం కూడా కష్టం. దీన్నుంచి బయటపడటానికి ఉదయ్‌ కిరణ్‌కు ట్రీట్‌మెంట్‌ అవసరమని భావించాం. అందుకే డాక్టర్‌ దగ్గర చేర్చాం’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఆ డాక్టర్‌ కూడా ఉదయ్‌ కిరణ్‌ని సొంత తమ్ముడిగా భావించి.. చికిత్స మొదలు పెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేంది. ఆవేశం తగ్గించుకోవాలి అని సూచించింది. అందుకు ఉదయ్‌ కిరణ్‌ కూడా అంగీకరించాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం.. ఆవేశపడిపోయేవాడు. తన సమస్యను కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు’’ అన్నారు మురళి మోహన్‌.

అలా చిరు కుటుంబంతో పరిచయం..

‘‘అంతకు ముందు ఉదయ్‌ కిరణ్‌ తరచుగా చిరంజీవిని కలిసేవాడు. చిరంజీవికి ఒక అలవాటు ఉంది. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా.. మంచి ప్రదర్శన ఇచ్చినా ఫోన్‌ చేసి అభినందించేవారు. హీరో, డైరెక్టర్‌, కెమరామెన్‌ ఇలా  అందరిని అభినందించేవారు. అలానే ఉదయ్‌ కిరణ్‌ని కూడా అభినందించారు. ఈ క్రమంలో ఓ సారి సార్‌ మిమ్మల్ని కలవాలి అని ఉదయ్‌ కిరణ్‌ అడిగాడు. అందుకు చిరు ఓకే చెప్పడంతో వెళ్లి కలవడం జరిగింది’’ అని మురళి మోహన్‌ గుర్తు చేసుకున్నారు.

‘‘ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ తరచుగా చిరును కలిసేవాడు. కొత్త కారు కొనుక్కున్నా.. ఇంకేదైనా సంఘటన జరిగినా.. వెళ్లి చిరంజీవితో చెప్పుకునేవాడు. దాంతో ఉదయ్‌ కిరణ్‌ మీద చిరుకి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈ కుర్రాడు చాలా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది.. మన ఫ్యామిలిలో కలుపుకుంటే బావుంటుంది అని ఆశపడినట్లు తెలిసింది’’ అని చెప్పుకొచ్చారు.

ఆ సంబంధం తప్పి పోయింది

‘‘చిరంజీవి తర్వాత ఆ కుటుంబంలో అన్నీ చూసుకునేది అల్లు అరవింద్‌. దాంతో చిరంజీవి.. ఉదయ్‌ కిరణ్‌ గురించి అల్లు అరవింద్‌తో చర్చించి.. పెళ్లి ఫిక్స్‌ చేసి.. ఫైనల్‌గా అనౌన్స్‌ కూడా చేశారు. దానిపై మేమంతా చాలా సంతోషించాం. ఉదయ్‌ కిరణ్‌ లాంటి మంచి కుర్రాడు చిరంజీవి గారి ఫ్యామిలిలో భాగం అవుతున్నాడని ఆనందపడ్డాం. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను అతడితో మాట్లాడి.. ఇది చాలా మంచి మ్యాచ్‌.. జాగ్రత్తగా చూసుకో అని సలహా కూడా ఇచ్చాను’’ అని తెలిపారు.

‘‘అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఏమైందో ఏమో ఆ సంబంధం చెడిపోయింది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడి సినిమాలు ఎన్నో ఫెయిల్‌ అయ్యాయి. వీటన్నింటికి తోడు అప్పటికే హైపర్‌ టెన్షన్‌ సమస్య కూడా ఉండటంతో.. ఆత్మహత్య వంటి బాధకరమైన నిర్ణయం తీసుకున్నాడేమో. ఉదయ్‌ కిరణ్‌ చనిపోయాడని తెలిసి.. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధపడ్డాను’’ అంటూ మురళి మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Show comments