బాంబు బెదిరింపు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు!

బాంబు బెదిరింపు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు!

బుధవారం తెల్లవారు జామున పలు స్కూళ్లల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆయా స్కూళ్లలో జరుగుతున్న పరీక్షలు, ఇతర కార్యక్రమాలను రద్దు చేసి.. సెలవులను ప్రకటించాయి. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బుధవారం తెల్లవారు జామున పలు స్కూళ్లల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆయా స్కూళ్లలో జరుగుతున్న పరీక్షలు, ఇతర కార్యక్రమాలను రద్దు చేసి.. సెలవులను ప్రకటించాయి. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

తరచూ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబుల కలకలం కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని ఆకాతాయిలు చేసే అల్లరి పనుల్లో భాగంగా అలాంటి ఫేక్ బాంబు బెదిరింపు వార్తలు వస్తుంటాయి. అలానే కొన్ని సార్లు నిజంగానే బాంబు బెదిరింపు ఫోన్లు , మెయిల్స్ వస్తుంటాయి. షాపింగ్ మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి పలు పబ్లిక్ ప్రదేశాల్లో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెయిల్స్ వస్తుంటాయి. దీంతో పోలీసులు,బాంబ్ స్కాడ్ సిబ్బంది అలెర్ట్ అవుతుంటాయి. ఇప్పటికే ఇలాంటి బెదిరింపు కాల్స్  చాలా సార్లు రాగా.. తాజాగా ఢిల్లీలోని పలు స్కూళ్లకి వచ్చాయి. దీంతో నగరంలోని పలు స్కూళ్లకి ప్రకటించారు. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బుధవారం ఉదయం ఢిల్లీలోని పలు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మొయిల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు పలు పాఠశాలకు బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. ఈ మేరకు పలు ప్రైవేటు పాఠశాలలు అప్రమత్తమయ్యాయి. సాంస్కృతి, మదర్ మేరిస్ మయూర్ విహార్ స్కూళ్లలో బాంబు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. ఇవే మెయిల్స్ మరికొన్ని పాఠశాలలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపాయి.

ఇక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ, నోయిడాలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అంతేకాక మెయిల్స్ వచ్చిన అన్ని పాఠశాలల్లో పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని సంస్కృతి స్కూల్,  అలానే తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ పాఠశాలకి,. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బుధవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. క్యాంపస్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పేర్కొంటూ పలు పాఠశాలలకు కూడా ఇలాంటి మెయిల్‌లు వచ్చాయి. బాంబు బెదిరింపులు వచ్చిన స్కూల్స్ లో ఒకటైన మదర్ మేరీ పరీక్షను నిర్వహిస్తోంది. అయితే ఈ బెదిరింపు బెయిల్స్ రావడంతో పరీక్షలను మధ్యలోనే ఆపేశారు.

అనంతరం పాఠశాల ఎమర్జెన్సీని ప్రకటించి, అందరూ వెంటనే ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని కోరారు. అనంతరం పలు పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెయిల్స్ చేశాయి. విద్యార్థుల భద్రత మరియు భద్రతకు ముప్పు కలిగించే ఇమెయిల్‌ను పాఠశాలకు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా మేము వెంటనే విద్యార్థులను ఇంటికి తిరిగి పంపుతున్నామని స్కూళ్ల యాజమాన్యాలు తెలిపాయి. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అన్నీ పాఠశాల వెళ్లి తనిఖీలు చేపట్టారు. అలానే మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో బెంగళూర్ నగరంలో కూడా ఇలాంటి మెయిల్స్ వచ్చాయి.

Show comments