దేశంలో ఆగని కరోనా.. 17 వేలు దాటిన బాధితులు..

దేశంలో ఆగని కరోనా.. 17 వేలు దాటిన బాధితులు..

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,324 మందికి ఈ వైరస్ సోకింది. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 17,265 కు చేరింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 543 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరో రెండు వేల మంది వైరస్ నుంచి కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. వైరస్ బాధితులు, మరణాల సంఖ్య మహారాష్ట్రలో అధికంగా ఉంది.

లాక్ డౌన్ సడలింపుపై జారీ చేసిన మార్గదర్శకాలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సడలింపులు ఇవ్వచ్చు. సడలింపు ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి విధించిన లాక్ డౌన్.. ఈనెల 14వ తో ముగియడంతో దాన్ని వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే జనజీవనం స్తంభించడం, ఆర్థిక వ్యవస్థకు కుదేలవడంతో ఈనెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలో పలు సడలింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, నిర్మాణ రంగాలు, చిన్న పరిశ్రమలు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Show comments