Manjummel Boys: ఆగని మంజుమ్మెల్ బాయ్స్ రికార్డుల వేట

ఆగని మంజుమ్మెల్ బాయ్స్ రికార్డుల వేట

మలయాళంలో మంజుమ్మెల్ బాయ్స్ .. కలెక్షన్లలో రికార్డుల మోత మోగిస్తోంది. తొలి షో నుండి మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లను దాటి..

మలయాళంలో మంజుమ్మెల్ బాయ్స్ .. కలెక్షన్లలో రికార్డుల మోత మోగిస్తోంది. తొలి షో నుండి మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లను దాటి..

ఫిబ్ర‌వ‌రి 22న థియేట‌ర్ల‌లో విడుదలయిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉంది. మొదటి షో నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోయింది. నిజానికి తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా నిర్మాతలకి ఊహించని రీతిలో లాభాలను తెచ్చిపెట్టింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కు తోడు ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు నచ్చడం వల్ల ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి లాంగ్ రన్ దొరికింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 175 కోట్ల గ్రాస్ వసూలు చేసి మలయాళ సినీ పరిశ్రమకు కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈరోజుతో (day end) సినిమా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద 180 కోట్లకు చేరువవుతాయి. కేవలం మూడు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గతంలో ఇండస్ట్రీ హిట్ అయిన 2018 మూవీని బీట్ చేసింది. 2018 చిత్రం ఇప్పటికీ కేరళతో ఇతర దేశాలలో అత్యధిక వసూళ్లు సాధించినా , తమిళనాడులో మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకి లభించిన అసాధారణమైన ఆదరణ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో సహాయపడింది. మంజుమ్మెల్ బాయ్స్ ఇప్పటి దాకా తమిళనాడులో 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాలో దాదాపు 40 శాతం తమిళ భాషలో డైలాగ్స్ ఉండటం… కమల్ హాసన్ తెరకెక్కించిన గునా సినిమాలోని సూపర్ హిట్ పాటకి సినిమాలో ప్రాధాన్యత ఉండటం తమిళ సినీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

ఇక బాక్సాఫీస్ వద్ద మంజుమ్మెల్ బాయ్స్ నెక్స్ట్ టార్గెట్ 200 కోట్ల క్లబ్‌లో చేరడమే. ఈ ఘనత గనక సాధిస్తే మలయాళ సినిమాకి ఇదొక భారీ రికార్డ్ అవుతుంది. కాగా ” ది బాయ్స్” పేరుతో ఈ సినిమాని త్వరలో తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ వెర్షన్లు కూడా హిట్ అయితే, మంజుమ్మెల్ బాయ్స్ 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Show comments