Lambasingi Movie Review and Rating in Telugu: బిగ్ బాస్ ఫేమ్.. దివి నటించిన 'లంబసింగి' మూవీ రివ్యూ!

Lambasingi Movie Review: బిగ్ బాస్ ఫేమ్.. దివి నటించిన ‘లంబసింగి’ మూవీ రివ్యూ!

సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసే బిగ్ బాస్ దివి.. తాజాగా లంబసింగి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? దివి ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసే బిగ్ బాస్ దివి.. తాజాగా లంబసింగి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? దివి ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

లంబసింగి

20240315,
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
  • నటినటులు:భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు.
  • దర్శకత్వం:నవీన్ గాంధీ
  • నిర్మాత:ఆనంద్ టి
  • సంగీతం:ఆర్ఆర్ ధృవన్
  • సినిమాటోగ్రఫీ:కె. బుజ్జి

2.75

ఫీల్ గుడ్ ప్రేమకథలకు ప్రేక్షకులు ఎప్పటికీ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అయితే అన్ని కథలు అభిమానులను ఆకట్టుకుంటాయి అనుకోవడం పొరపాటే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అచ్చమైన పల్లెటూరి ప్రేమకథతో సినిమా రాలేదనే చెప్పాలి. ఆ లోటును పూడ్చటానికి బిగ్ బాస్ ఫేమ్ దివి ‘లంబసింగి’ అనే స్వచ్ఛమైన పల్లెటూరి లవ్ స్టోరీతో మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం లాంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది దివి. మరి లంబసింగి మూవీ ఎలా ఉంది? సోషల్ మీడియాలో తన అందచందాలతో కవ్వించే దివి ఈ మూవీతో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

వీరబాబు(భరత్ రాజు, తొలిపరిచయం) కానిస్టేబుల్ గా ఎంపికై లంబసింగి అనే గ్రామానికి వస్తాడు. తొలిచూపులోనే హరిత(దివి)ని చూపి ప్రేమలో పడిపోతాడు. ఆమె ఎవరో కాదు.. ఓ మాజీ నక్సలైట్ కూతురు. మాజీ నక్సలైట్లను గమనిస్తూ, వారిచేత రోజూ సంతకాలు తీసుకోవడం వీరబాబు పని. దీంతో హరితకు లైన్ వేయడానికి అతడికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. అయితే అనుకోకుండా ఓ రోజు ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన ఏంటి? దాంతో వీరిద్దరు ఒక్కటైయ్యారా? హరిత గతం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘లంబసింగి’ చిత్రాన్ని ఓ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కించాడు డైరెక్టర్ నవీన్ గాంధీ. అతడు తీసుకున్న పాయింట్ బాగుందనే చెప్పాలి. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో అక్కడక్కడ తడబడ్డాడు. వీరబాబుకు జాబ్ రావడం, హరితతో ప్రేమలో పడటంతో కథ ప్రారంభం అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా సాగిందన్న ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. హీరోయిన్ వెంట పడటం, ఆమె చీ కొట్టడం లాంటి రోటీన్ సీన్స్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే సెకండాఫ్ లో కథ వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను డిజైన్ చేసిన తీరు మెచ్చుకోవచ్చు. అక్కడక్కడ డైలాగ్స్ బాగానే పేలాయి. ఇక వీరబాబు, రాజు గారు మధ్య వచ్చే కామెడీ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. పోలీస్ స్టేషన్ పై దాడి చేసే సీన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. క్లైమాక్స్ కు వెళ్లే కొద్ది ఎమోషనల్ ను క్యారీ చేస్తూ వచ్చాడు డైరెక్టర్. అయితే అక్కడక్కడ కొన్ని లెంతీ సీన్స్ విసుగుతెప్పిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించిన విధంగానే ఉంటుంది. అయితే థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకుడు మాత్రం ఎమోషనల్ ను క్యారీ చేస్తూ వస్తాడు.

నటీ, నటుల పనితీరు:

హీరోగా తొలి చిత్రం చేస్తున్న భరత్ రాజు ఎక్కడా ఆ ఫీల్ రానివ్వలేదు. కానిస్తేబుల్ వీరబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో న్యాచురల్ గా నటించి ఫస్ట్ మూవీకే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక దివి విషయానికి వస్తే.. అందమే కాదు.. ఆమెలో సహజమైన నటి ఉందని ఈ మూవీతో తెలిసొచ్చింది. హరిత అనే పాత్రకి వందకు వందశాతం న్యాయం చేసింది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు, ఈ మూవీలో చేసిన పాత్రకు పోలికే ఉండదు. అంతలా ఛేంజోవర్ అయ్యింది దివి. మిగతా పాత్రలు చేసినవారు తమ పరిధిమేర నటించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం వినసొంపుగా ఉంది. చిన్న సినిమాలో ఇలాంటి బీజీఎం ఎవ్వరూ ఊహించి ఉండరు. లంబసింగి అందాలను తన కెమెరాతో మరింత అందంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ కె.బుజ్జి. ప్రతీ ఫ్రేమ్ ను అద్బుతంగా చూపించాడు. ఇక ఎడిటర్ విజయ్ వర్ధన్ పర్వాలేదనిపించాడు. ఇంకాస్త కత్తెరకు పదునుపెడితే బాగుండేదనిపిస్తుంది. ఇక డైరెక్టర్ నవీన్ గాంధీ విషయానికి వస్తే.. కథ బాగుంది, డైరెక్షన్ కూడా ఓకే. కానీ కథను తెరకెక్కించే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు సినిమా చూస్తుంటే తెలుస్తుంది. క్లైమాక్స్ ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేది.

బలాలు

  • దివి నటన
  • కథ

బలహీనతలు

  • స్లో నెరేషన్
  • క్లైమాక్స్

చివరి మాట: లంబసింగి.. ఫీల్ గుడ్ స్టోరీలో ‘ఫీల్’ మిస్సైంది.

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇదికూడా చదవండి: Razakar Review & Rating: ట్రైలర్‌తో సంచలనాలు సృష్టించిన రజాకార్‌ మూవీ రివ్యూ

Show comments