OTT Movie: OTT లోకి అదిరిపోయే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో కూడా!

OTT Movie: OTT లోకి అదిరిపోయే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో కూడా!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉన్నా సరే.. కొంతమంది హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ సిరీస్ ను తెలుగులోకి కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉన్నా సరే.. కొంతమంది హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ సిరీస్ ను తెలుగులోకి కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లోకి వస్తున్న సినిమాలను, సిరీస్ లను మిస్ కాకుండా చూసే ప్రేక్షకులకు.. ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే చాలా మందికి హాలీవుడ్ సినిమాలను చూడడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తూ ఉంటారు. అవి ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కానీ.. ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. మరి అవే హాలీవుడ్ చిత్రాలు తెలుగులో కూడా వస్తే .. ఇంకా హాలీవుడ్ మూవీ లవర్స్ వాటిని చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రాన్ని.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ చిత్రం ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది మొదట్లోనే వచ్చినా కూడా.. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చారు. ఈ ఆసక్తికరమైన యాక్షన్ చిత్రం మరేదో కాదు.. “ఈక్వ‌లైజ‌ర్ 3”. ఈ సినిమా ఇప్పటికే రెండు భాగాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. గతంలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కనిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టమైన వారికి.. ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రాలను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఈక్వ‌లైజ‌ర్ మూవీ కథ విషయానికొస్తే.. అమెరికా మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఎజెన్సీ నుంచి రాబర్ట్ మెక్ కాల్ రిటైర్డ్ అవుతాడు. అయితే అతను ఇటలీలోని సిసిలీలో ఓ గ్యాంగ్ స్టార్ ను అతని.. ముఠాను చంపి.. తప్పించుకునే ప్రయత్నంలో గాయపడి.. స్పృహ కోల్పోయి.. అక్కడే ఓ మారుమూల ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఓ వ్యక్తి అతనిని రక్షిస్తాడు. అయితే, అదే సమయంలో.. వేరే ఓ గ్యాంగ్ ఆ ఏరియాను ఖాళీ చేయాలనీ ప్రజలకు ఆదేశాలు జారీ చేసి.. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఈ క్రమంలో రాబర్ట్ మెక్ కాల్ ఆ గ్యాంగ్ కు ఎదురుతిరుగుతాడు. మరో వైపు పోలీస్ వారు ఇతనిని పట్టుకునేందుకు వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో అతను ఎలా తప్పించుకున్నాడు.. ఆ గ్యాంగ్ తో ఇతని పోరాటం ఎంత వరకు సాగింది. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. చివరి వరకు కూడా ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ .. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో కొనసాగుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments