Joram Director Devashish Makhija: బ్లాక్​బస్టర్ మూవీ డైరెక్టర్.. ఎన్నో అవార్డులు కొట్టాడు! ఇప్పుడు దీనస్థితిలో..

బ్లాక్​బస్టర్ మూవీ డైరెక్టర్.. ఎన్నో అవార్డులు కొట్టాడు! ఇప్పుడు దీనస్థితిలో..

స్టార్ హీరోతో బ్లాక్​బస్టర్ ఫిల్మ్ తీశాడు. ఎన్నో అవార్డులు కొట్టాడు. కానీ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎవరా దర్శకనిర్మాత? ఎందుకిలా అయిపోయాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ హీరోతో బ్లాక్​బస్టర్ ఫిల్మ్ తీశాడు. ఎన్నో అవార్డులు కొట్టాడు. కానీ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎవరా దర్శకనిర్మాత? ఎందుకిలా అయిపోయాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలేద్దామని అందరిలాగే తనూ ఎన్నో కలలతో ముంబైకి బయల్దేరాడు. డైరెక్టర్​గా బాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని అనుకున్నాడు. అయితే చాలా మందిలా రొటీన్ సినిమాలు తీస్తూ ఉండిపోవాలని అనుకోలేదు. డిఫరెంట్ మూవీస్​తో ఆడియెన్స్ మనసుల్లో చెరగని స్థానం సంపాదించాలనుకున్నాడు. దర్శకుడిగా మారకముందు రైటర్​గా, అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశాడు. కాస్త డబ్బులు కూడబెట్టుకొని డైరెక్టర్ అవతారం ఎత్తాడు. పలు బ్లాక్​బస్టర్ సినిమాలు తీశాడు. ఫిల్మ్ ఫెస్టివల్స్​లో అవార్డులను దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేక దీనస్థితిలో ఉన్నాడు. ఆ దర్శకనిర్మాత పేరు దేవశిష్ మఖీజా. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే సామెతలు మఖీజాకు సూట్ అవ్వవు.

సినిమాలు ఓ కళ అని.. ఆ మాధ్యమం ద్వారా మంచి కథలు చెప్పి సమాజంలో మార్పు తీసుకు రావాలని అనుకున్నాడు మఖీజా. అంతేగానీ డబ్బులు కూటబెట్టుకోవాలనే ధ్యాసే లేదు. అదే అతడ్ని రోడ్డు మీదకు తీసుకొచ్చింది. మంచి లైఫ్​ను లీడ్ చేయాలన్నా, మనం కన్న కలల్ని నిజం చేసుకోవాలన్నా డబ్బులు చాలా ముఖ్యమని చాలా మంది పెద్దలు అంటుంటారు. కానీ డబ్బు కంటే కళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వంతో తాను దివాలా తీశానని అంటున్నాడు దేవశిష్​. ‘నాకు ఇప్పుడు 40 ఏళ్లు. కానీ ఓ సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా వద్ద డబ్బుల్లేవ్. నేను తీసిన మూవీస్​తో కొంచెం కూడా డబ్బుల్ని కూడబెట్టుకోలేకపోయా. ఇప్పటికీ ఇంటి రెంట్ కట్టడానికి కష్టపడుతున్నా. ‘జొరమ్’ చిత్రం వల్ల నాకు లాభాలు కాదు కదా.. ఏకంగా దివాలా తీశా. ఐదు నెలలుగా నేను అద్దె కట్టలేదు. మా ఇంటి ఓనర్ నన్ను ఇంటి నుంచి గెంటేయొద్దని కోరుకుంటున్నా. కళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది’ అని బాధపడ్డాడు దేవశిష్​.

కాగా, ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ భాజ్​పాయ్​తో ‘జొరమ్’ అనే సినిమా తీశాడు దేవశిష్. గతేడాది డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్​లో అనేక అవార్డులు కొల్లగొట్టింది. అమెజాన్ ప్రైమ్​లో ఈ మూవీ రెంట్ బేసిస్​లో అందులోబాటులో ఉంది. అయితే క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కినా, అవార్డులు వచ్చినా పెద్దగా వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. దర్శకనిర్మాత అయిన దేవశిష్ 2017లో ‘అజ్జి’ అనే మూవీ తీశాడు. 1 కోటి పెట్టుబడితో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. బాక్సాఫీస్ వద్ద రూ.15 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. రీసెంట్​గా వచ్చిన ‘జొరమ్’ అతడ్ని నిండా ముంచేసింది. ఇప్పుడు తన చేతిలో 20కి పైగా స్క్రిప్ట్స్​ ఉన్నాయని.. కానీ దాన్ని సినిమాగా మలిచేందుకు ఎవరూ రెడీగా లేరని వాపోయాడు. మరి.. డైరెక్టర్ దేవశిష్​ మఖీజా స్టోరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RGV శారీ సుందరి.. ఇలా మారిందేంటీ..?

Show comments