Health Checking Toilets: హెల్త్ చెకింగ్ టాయిలెట్స్.. హాస్పిటల్‌కి వెళ్లకుండానే టెస్టులు చేసేస్తుంది

హెల్త్ చెకింగ్ టాయిలెట్స్.. హాస్పిటల్‌కి వెళ్లకుండానే టెస్టులు చేసేస్తుంది

హాస్పిటల్ కి వెళ్లకుండా యూరిన్ ద్వారా మనలో ఉన్న లోపాలను, అనారోగ్య సమస్యలను గుర్తించే పరికరం ఉంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటికే స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ హెల్త్ డివైజ్ లు వంటివి మనుషుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ జాగ్రత్తపడేలా చేస్తున్నాయి. తాజాగా హెల్త్ చెకింగ్ టాయిలెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మనిషిలో ఏదైనా లోపం ఉంటే బయటపెట్టేస్తున్నాయి.

హాస్పిటల్ కి వెళ్లకుండా యూరిన్ ద్వారా మనలో ఉన్న లోపాలను, అనారోగ్య సమస్యలను గుర్తించే పరికరం ఉంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటికే స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ హెల్త్ డివైజ్ లు వంటివి మనుషుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ జాగ్రత్తపడేలా చేస్తున్నాయి. తాజాగా హెల్త్ చెకింగ్ టాయిలెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మనిషిలో ఏదైనా లోపం ఉంటే బయటపెట్టేస్తున్నాయి.

జనానికి సౌకర్యంగా, ఎక్కువ శుభ్రంగా ఉండేలా స్మార్ట్ టాయిలెట్స్ ని రూపొందిస్తున్నారు. టాయిలెట్ పోసిన తర్వాత, లండన్ వెళ్లిన తర్వాత.. ఫ్లష్ ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్ గా దానికదే నీళ్లు పోసుకునే సెన్సార్ టాయిలెట్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్ లలో మీరు స్మార్ట్ టాయిలెట్స్ ని గమనించవచ్చు. అయితే యూరిన్ పోస్తే ఉన్న రోగాలను చెప్పే టాయిలెట్స్ గురించి విన్నారా? అవును యూరిన్ పోస్తే హాస్పిటల్ కి వెళ్లి యూరిన్ టెస్టులు చేయించుకునే పని లేకుండా.. ఆ టాయిలెట్టే ఉన్న జబ్బులను చెప్పేస్తుంది.  

ఈ స్మార్ట్ టాయిలెట్స్ ని చైనా తీసుకొచ్చింది. చైనా ప్రజలు తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేందుకు.. తమకి ఉన్న రోగాలను ముదరకుండా ముందుగానే గుర్తించి జాగ్రత్తపడేందుకు అక్కడి వారు ఈ స్మార్ట్ టాయిలెట్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. జస్ట్ యూరిన్ పోస్తే చాలు. ఎవరెవరికి ఏ ఏ రోగాలు ఉన్నాయో? ఏ ఏ లోపాలు ఉన్నాయో అనేది చెప్పేస్తుంది. ఈ స్మార్ట్ టాయిలెట్స్ ని చైనాలోని బీజింగ్, షాంఘై వంటి ప్రధాన నగరాల్లో ఉన్న పబ్లిక్ మెన్స్ రెస్ట్ రూమ్స్ లో ఉంచారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. యూరిన్ ని టెస్టింగ్ కి 20 యువాన్ లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీ ప్రకారం 230 అన్న మాట. వీటిని అక్కడ హెల్త్ చెకింగ్ యూరినల్స్ గా పిలుస్తున్నారు.

షాంఘైకి చెందిన డాక్యుమెంటరీ డైరెక్టర్ క్రిస్టియన్ పీటర్సన్ క్లాసన్ అనే వ్యక్తి.. ఈ స్మార్ట్ టాయిలెట్ కి సంబంధించి ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల ఆయన పబ్లిక్ మెన్స్ రెస్ట్ రూమ్ కి వెళ్లి అక్కడ యూరిన్ టెస్ట్ టాయిలెట్ లో యూరిన్ పోశానని.. ఆటోమేటిక్ గా తన యూరిన్ టెస్ట్ జరిగిందని అన్నారు. ఆ టెస్టులో తనకు కాల్షియం లోపం ఉందని తేలిందని అన్నారు. దీంతో డైలీ తగినంత పాలు తాగేవాడ్ని అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత మరొక టాయిలెట్ లో టెస్ట్ చేసుకున్నాడు. అప్పుడు కాల్షియం లెవల్స్ సరిపడా ఉన్నాయని టెస్టులో తేలిందని వెల్లడించారు. ఈ టాయిలెట్స్ వల్ల ప్రజలు ముందుగానే తమ లోపాలను గుర్తించి.. ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలు ఉంటుందని అంటున్నారు.

అయితే ఇవి హాస్పిటల్స్ లో డాక్టర్ ని కలిసే విధానాన్ని రీప్లేస్ చేయలేవని.. కానీ ముందస్తుగా మీకున్న సమస్య గురించి అలర్ట్ చేస్తుందని అంటున్నారు. యాపిల్ స్మార్ట్ వాచెస్ ఎలా అయితే గుండెపోటుని గుర్తించి మనుషులను కాపాడుతుందో అలా ఈ స్మార్ట్ టాయిలెట్స్ అనేవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని క్రిస్టియన్ పీటర్సన్ అన్నారు. ఈ స్మార్ట్ టాయిలెట్స్ వల్ల ప్రత్యేకించి యూరిన్ టెస్టులు చేయించుకునే పరిస్థితి తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న ఈ హెల్త్ చెకింగ్ టాయిలెట్స్ త్వరలో మిగతా దేశాలకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ స్మార్ట్ టాయిలెట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments