Jana Sena which contested eight seats in Telangana elections lost its deposits: తెలంగాణలో పవన్ ఫ్యాన్స్ కల్ట్! 8 చోట్ల డిపాజిట్స్ గల్లంతు!

తెలంగాణలో పవన్ ఫ్యాన్స్ కల్ట్! 8 చోట్ల డిపాజిట్స్ గల్లంతు!

తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన డిపాజిట్లు కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనుకున్న పవన్ పార్టీ చతికిల పడింది. దీంతో పవన్ కళ్యాణ్ అయోమయంల పడిపోయారు.

తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన డిపాజిట్లు కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనుకున్న పవన్ పార్టీ చతికిల పడింది. దీంతో పవన్ కళ్యాణ్ అయోమయంల పడిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. 15 చోట్ల విజయం సాధించగా.. 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ మూడు చోట్ల గెలవగా.. 37 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 8 స్థానాల్లో 8 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎంఐఎం పార్టీ ఒక చోట గెలవగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో దిగిన జనసేన.. అడ్రస్ లేకుండా పోయింది. 8 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.

తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాన్ పార్టీ జనసేనా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పవన్ కనబడితే చాలు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేసే ఫ్యాన్స్ పవన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని, జనసేనా విజయానికి కృషి చేస్తామన్నా జనసైనికులు ఆఖరికి పవన్ కు, ఆయన పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటికైనా సినిమాలు వేరు, రాజకీయం వేరు అనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తామని విర్రవీగుతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు సూచిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనా పోటీచేసిన నియోజకవర్గాలు ఏవంటే.. హై దరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలిచింది. వీటితోపాటు కోదాడ, తాండూరు, నాగర్‌కర్నూల్ స్థానాలను జనసేనకు కేటాయించారు. కాగా ఈ నియోజవర్గాల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. కనీసం డిపాజిట్స్ కూడా దక్కించుకోకపోవడంతో ఆ పార్టీ ఆయోమయంలో పడింది. పవన్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి ప్రజలకు విశ్వాసం కల్పిస్తే తప్ప జనసేనకు రాజకీయ మనుగడ లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments