James & KGF : శాండల్ వుడ్ పవర్ స్టార్ కి బ్రహ్మరథం

James & KGF : శాండల్ వుడ్ పవర్ స్టార్ కి బ్రహ్మరథం

అది కూడా ఒక్క కన్నడ వెర్షన్ నుంచే కావడం గమనార్హం. తెలుగులో టాక్ అండ్ రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు కానీ అక్కడి అప్పు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడిని తెరమీద చూస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు.

అది కూడా ఒక్క కన్నడ వెర్షన్ నుంచే కావడం గమనార్హం. తెలుగులో టాక్ అండ్ రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు కానీ అక్కడి అప్పు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడిని తెరమీద చూస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు.

నిన్న విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చివరి ఫుల్ లెన్త్ సినిమా జేమ్స్ కి కర్ణాటక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజే సుమారు 26 కోట్ల రూపాయల వసూళ్లతో ఆ రాష్ట్రంలో నెవర్ బిఫోర్ రికార్డు సాధించింది. అది కూడా ఒక్క కన్నడ వెర్షన్ నుంచే కావడం గమనార్హం. తెలుగులో టాక్ అండ్ రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు కానీ అక్కడి అప్పు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడిని తెరమీద చూస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. కొందరైతే థియేటర్ల వద్దే అన్నపానీయాలు ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు. మొత్తం నాలుగు షోలు వరసబెట్టి చూసిన అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

కొన్ని మినహాయించి అక్కడ అన్ని హాళ్లలో కేవలం జేమ్స్ మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఇవాళ రేపు కూడా భారీ ఎత్తున హౌస్ ఫుల్స్ ఉన్నాయి. చాలా చోట్ల వేలసంఖ్యలో టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయి. స్కూల్స్ కాలేజీలు ఎగొట్టి మరీ విద్యార్థులు బారులు తీరుతున్నారు. ప్రతి చోట్ల క్లైమాక్స్ కాగానే వందల సంఖ్యలో కన్నీళ్లు పెట్టుకోవడం సాధారణ దృశ్యంగా మారిపోయింది. కడచూపు ఇలా చూసుకోవాల్సి వచ్చిందని వచ్చిన ప్రతి హృదయం తల్లడిల్లుతోంది. ఫైనల్ రన్ వసూళ్లను బీట్ చేయాలంటే మళ్ళీ కెజిఎఫ్ 2కి తప్ప ఇంకో రెగ్యులర్ కమర్షియల్ మూవీకి సాధ్యం కాదని అక్కడి ట్రేడ్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు.

నిజంగా జేమ్స్ సాధించింది గొప్ప ఘనతే. తెలుగు హిందీ తమిళంలో యావరేజ్ గా ఆడుతున్న ఈ చిత్రం సోమవారం నుంచి బాగా నెమ్మదించడం ఖాయం. ఇక్కడి ఫిగర్స్ మీద నిర్మాతకు పెద్దగా ఆశలేం లేవు. దేశమంతా భీభత్సంగా ఆడుతున్న కాశ్మీర్ ఫైల్స్ ని సైతం కన్నడ జనం పక్కన పెట్టేశారు. డిమాండ్ ఉన్నా లేకపోయినా దానికి షోలను బాగా తగ్గించేశారు. ఆర్ఆర్ఆర్ వచ్చే లోగా జేమ్స్ ఎంత రాబడుతుందనేది కీలకంగా మారింది. ట్రిపులార్ వచ్చినా సరే జేమ్స్ నే కంటిన్యూ చేస్తామని అంటున్న థియేటర్ల ఓనర్లు లేకపోలేదు. మొత్తానికి తను లేకపోయినా సినిమా రూపంలో మళ్ళీ బ్రతికివచ్చి కోట్ల వర్షం కురిపిస్తున్న పునీత్ నిజంగా పునీతుడే

Also Read : Salute Report : సెల్యూట్ రిపోర్ట్

Show comments