వీడియో: SRH vs MI మ్యాచ్ లో ఇది గమనించారా? క్లాసెన్ ను పచ్చి బూ*తులు తిట్టిన చావ్లా!

వీడియో: SRH vs MI మ్యాచ్ లో ఇది గమనించారా? క్లాసెన్ ను పచ్చి బూ*తులు తిట్టిన చావ్లా!

సన్ రైజర్స్ ఆటగాడు అయిన హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేసిన తర్వాత ఓ భారీ బూతు పదం వాడాడు ముంబై బౌలర్ పియూష్ చావ్లా. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సన్ రైజర్స్ ఆటగాడు అయిన హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేసిన తర్వాత ఓ భారీ బూతు పదం వాడాడు ముంబై బౌలర్ పియూష్ చావ్లా. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతూ ఉంటారు. దాంతో ప్రత్యర్థి ప్లేయర్లపైనే కాకుండా.. సొంత టీమ్ ఆటగాళ్లపై కూడా నోరుజారుతూ ఉంటారు. ఒక్కొసారి పచ్చి బూ*తులు కూడా తిడుతూ ఉంటారు. అయితే అవి మ్యాచ్ జరిగే టైమ్ లో పెద్దగా ఎవ్వరూ గమనించి ఉండరు. ఇలాంటి సంఘటనలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ సంఘటనే SRH vs MI మ్యాచ్ లో చోటు చేసుకుంది. బహుశా ఇది ఎవ్వరూ గుర్తించి ఉండరు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు అయిన హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేసిన తర్వాత ఓ భారీ బూతు పదం వాడాడు ముంబై బౌలర్ పియూష్ చావ్లా. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు ముంబై స్టార్ స్పిన్నర్ పియూష్ చావ్లా. తన వరుస ఓవర్లలో ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ లను పెవిలియన్ కు చేర్చాడు. దాంతో SRH పరుగుల వేగం తగ్గి 173 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్ ఒకటి జరిగింది. తాజాగా ఈ సీన్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే?

సన్ రైజర్స్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు పియూష్ చావ్లా. అప్పటికి క్రీజ్ లో హెన్రిచ్ క్లాసెన్-మార్కో జాన్సెన్ ఉన్నారు. ఇక ఈ ఓవర్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ క్లాసెన్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓ పెద్ద బూతు మాటను క్లాసెన్ ను ఉద్దేశించి అన్నాడు చావ్లా.  బహుశా ఇది అప్పుడు ఎవ్వరూ గమనించలేదు అనుకుంటా. కానీ ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చాలా పద్దతిగా వివాదరహితుడిగా కనిపించే చావ్లా నోటి నుంచి ఈ బూతును ఎవ్వరూ ఊహించలేదు. ఏంటి చావ్లా భాయ్ అంత పెద్ద మాట అన్నావ్.. తప్పు కదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments