Virat Kohli: వీడియో: చిరుత కూడా ఇంత వేగంగా పరిగెత్తదేమో? కోహ్లీ చేసిన మెరుపు రనౌట్ చూసి తీరాల్సిందే!

Virat Kohli: వీడియో: చిరుత కూడా ఇంత వేగంగా పరిగెత్తదేమో? కోహ్లీ చేసిన మెరుపు రనౌట్ చూసి తీరాల్సిందే!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఓ నమ్మశక్యం కానీ రనౌట్ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఓ నమ్మశక్యం కానీ రనౌట్ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ.. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు. ఆ పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేవి ఇవే. తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ కు ఏకఛత్రాదిపత్యంగా ఏలుతూ వస్తున్నాడు ఈ రన్ మెషిన్. ఇక ఇతడు మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు చమటలు పట్టాల్సిందే. బ్యాటింగ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో.. ఫీల్డింగ్ లో అంతకంటే అగ్రెసివ్ గా దూసుకెళ్తాడన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చిరుత కంటే వేగంగా పరిగెత్తి అతడు చేసిన మెరుపు రనౌట్ ను చూసితీరాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది.

పంజాబ్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో చెలరేగిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. ఆర్సీబీ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు తొలి ఓవర్లోనే భారీ షాకిచ్చాడు స్వప్నిల్ సింగ్. ఓపెనర్ ప్రబ్ సిమ్రన్ సింగ్(6) కు ఎల్బీగా అవుట్ చేశాడు. అనంతరం జానీ బెయిర్ స్టోతో జతకలిసిన రొసోవ్.. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బెయిర్ స్టో(27) అవుట్ అయ్యే సమయానికి పంజాబ్ 5.5 ఓవర్లో 71 పరుగులు చేసింది. అతడు పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నయా సంచలనం శశాంక్ సింగ్ తో కలిసి రోసోవ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలోనే 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న శశాంక్ సింగ్ ను చిరుత కంటే మెరుపువేగంతో పరిగెత్తుకొచ్చి రనౌట్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఈ సంఘటన పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో పెర్గ్యూసన్ వేసిన 4వ బంతిని డిఫెన్స్ ఆడి.. ఒక రన్ తీసి, రెండో రన్ కు ప్రయత్నించారు. ఈలోగా బౌండరీ లైన్ దగ్గర నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా చిరుత కంటే స్పీడ్ గా పరిగెత్తుకొచ్చి.. డైవ్ చేస్తూ త్రో విసిరాడు. ఆ బాల్ కాస్త డైరెక్ట్ గా వికెట్లను గిరాటేసింది. అప్పటికి శశాంక్ ఇంకా క్రీజ్ లోకి రాలేదు. దాంతో అతడు రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ కోహ్లీ చేసిన రనౌట్ చూసి బిత్తరపోతున్నాడు. కాళ్లలో స్పింగ్స్ ఉన్నాయా? కోహ్లీ భాయ్.. అలా పరిగెత్తావ్ ఏంటి? నువ్వు ఒలింపిక్స్ కు వెళ్తే ఇండియాకు గోల్డ్ మెడల్ ఖాయం.. అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీ చేసిన ఈ రనౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments