IPL : రోహిత్ శర్మ చెత్త రికార్డ్ ను సమం చేసిన హార్దిక్ పాండ్యా

IPL : రోహిత్ శర్మ చెత్త రికార్డ్ ను సమం చేసిన హార్దిక్ పాండ్యా

IPL 2024 సీజన్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డును సమం చేశాడు ముంబై నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి ఆ చెత్త రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డును సమం చేశాడు ముంబై నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి ఆ చెత్త రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో 14 మ్యాచ్ లు ఆడి కేవలం  4 మ్యాచ్ ల్లోనే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపకీర్తిని మూటగట్టుకుంది ముంబై. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో సైతం 18 పరుగుల తేడాతో ఓడిపోయి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచింది. ఈ ఓటమితో రోహిత్ శర్మ చెత్త రికార్డు ను సమం చేశాడు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి ఆ వరస్ట్ రికార్డ్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ తన ఖాతాలో ఓ చెత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది.  ఈ సీజన్ లో 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది ముంబై. దాంతో ఓ ఐపీఎల్ సీజన్ లో ఇలా 10 మ్యాచ్ ల్లో ఓడిపోవడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో 2022 ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కూడా 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో రోహిత్ పేరున ఉన్న వరస్ట్ రికార్డ్ ను సమం చేశాడు హార్దిక్ పాండ్యా.

కాగా.. 2020 సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై.. ఆ తర్వాత 2021, 2022 సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ముంబై టీమ్ టైటిల్ ను సాధించలేకపోయింది. ఇక ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పే అని నెటిజన్లు, క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments