Virat Kohli: షాట్ ఆఫ్ ది టోర్నమెంట్.. ఇలా సిక్స్ కొట్టడం కోహ్లీకే సాధ్యం! వీడియో వైరల్..

Virat Kohli: షాట్ ఆఫ్ ది టోర్నమెంట్.. ఇలా సిక్స్ కొట్టడం కోహ్లీకే సాధ్యం! వీడియో వైరల్..

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన ఓ సిక్స్ టోర్నీకే హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఇలా సిక్స్ కొట్టడం కోహ్లీకే సాధ్యం అంటున్నారు ఫ్యాన్స్. మరీ మీరూ ఆ వీడియోను చూసేయండి.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన ఓ సిక్స్ టోర్నీకే హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఇలా సిక్స్ కొట్టడం కోహ్లీకే సాధ్యం అంటున్నారు ఫ్యాన్స్. మరీ మీరూ ఆ వీడియోను చూసేయండి.

ఐపీఎల్ 2024లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. దాంతో తమ ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 60 పరుగులు తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ((92), రజత్ పాటిదార్(55) చెలరేగారు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ బౌలింగ్ లో కింగ్ కోహ్లీ కొట్టిన సిక్స్ టోర్నీకే హైలెట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆ సిక్స్ వీడియో వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్-ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో 60 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. కింగ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో పరుగులు వరదపారిస్తున్న విరాట్ తృటిలో మరో శతకాన్ని మిస్ చేసుకున్నాడు.

పంజాబ్ బౌలర్లను చితక్కొడుతూ.. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 92 పరుగులు చేసి సెంచరీని కొద్దిలో చేజార్చుకున్నాడు. ఇక విరాట్ కు తోడు రజత్ పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అనంతరం 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ టీమ్ లో రూసో 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కొట్టిన ఓ సిక్స్ టోర్నీకే హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సామ్ కర్రన్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెండో బంతిని యార్కర్ గా వేయబోయాడు. కానీ అక్కడుంది విరాట్ కోహ్లీ.. ఆ బాల్ ను కాలు మడిచి స్వీప్ షాట్ తరహాలో భారీ షాట్ కొట్టాడు. దాంతో బాల్ స్టాండ్స్ లో పడింది. ఈ షాట్ చూసి కర్రన్ షాక్ కు గురైయ్యాడు. ప్రస్తుతం ఈ షాట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీంతో ఇలాంటి షాట్స్ కొట్టడం కోహ్లీకే సాధ్యం అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ షాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments