KKR vs RCB Powerplay Score Worst Record: RCB మరో చెత్త రికార్డు.. కోహ్లీ టీమ్​ కథ మారలేదు!

RCB మరో చెత్త రికార్డు.. కోహ్లీ టీమ్​ కథ మారలేదు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మారలేదు. వరుస ఓటములతో డీలాపడ్డ డుప్లెసిస్ సేన.. మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మారలేదు. వరుస ఓటములతో డీలాపడ్డ డుప్లెసిస్ సేన.. మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

జస్ట్ సీజన్ మారింది. ఆర్సీబీ ఆటతీరు, ఫేట్ మాత్రం మారలేదు. ఫస్ట్ సీజన్ నుంచి అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ కప్పును ఈసారైనా గెలుస్తుందేమో అనుకుంటే మళ్లీ నిరాశ తప్పేలా లేదు. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్న డుప్లెసిస్ సేన.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో కేకేఆర్ మీద చెత్తగా ఆడుతోంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్​తో కోహ్లీ టీమ్ మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న బెంగళూరు మరో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్​లో పవర్​ప్లేలో ఎక్కువ సార్లు 70 ప్లస్ స్కోర్లు సమర్పించుకున్న టీమ్​గా ఆర్సీబీ నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్​​లో ఇప్పటిదాకా 8 మ్యాచ్​ల్లో 4 సార్లు ఆ టీమ్ బౌలర్లు పవర్​ప్లేలో 70కి పైగా పరుగులు ఇచ్చుకున్నారు. కోల్​కతా నైట్ రైడర్స్ (85/0, 75/1), ముంబై ఇండియన్స్ (72/0), సన్​రైజర్స్ హైదరాబాద్ (76/0)తో జరిగిన మ్యాచ్​ల్లో బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా ఫెయిలయ్యారు. ఇక, ఇవాళ్టి మ్యాచ్​లో కేకేఆర్ సంధించిన బిగ్ టోటల్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగగిన బెంగళూరు ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 12 పరుగులతో ఉంది. కోహ్లీ (11 నాటౌట్), డుప్లెసిస్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. ఆర్సీబీ చెత్త రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments