Shubman Gill Hits 100th Century In IPL: గిల్ సూపర్ సెంచరీ.. IPL హిస్టరీలో ఇది చాలా స్పెషల్!

GT vs CSK: గిల్ సూపర్ సెంచరీ.. IPL హిస్టరీలో ఇది చాలా స్పెషల్!

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే చాలా స్పెషల్ సెంచరీ అని చెప్పాలి.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే చాలా స్పెషల్ సెంచరీ అని చెప్పాలి.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులు కొట్టడమే టార్గెట్​గా పెట్టుకొని ఆడాడు. 55 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లతో పాటు 6 భారీ సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (31 బంతుల్లో 103) కూడా శతకం బాదాడు. ఇది అతడికి ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే అతడి కంటే కూడా గిల్ సెంచరీ చాలా స్పెషల్ అనే చెప్పాలి.

గిల్ శతకం ఐపీఎల్ హిస్టరీలోనే చాలా స్పెషల్ అని చెప్పాలి. దీనికి కారణం అది వందో శతకం కావడమే. లీగ్ చరిత్రలో తొలి శతకాన్ని బ్రెండన్ మెకల్లమ్ బాదగా.. గిల్ చేసింది వందో సెంచరీగా నిలిచింది. కాబట్టి లీగ్ శతకాల గురించి మాట్లాడుకుంటే వందోది ఎవరు కొట్టారంటే శుబ్​మన్ ప్రస్తావనే వస్తుంది. ఇక, సీఎస్​కేతో మ్యాచ్​లో గిల్-సుదర్శన్ కలసి ఫస్ట్ వికెట్​కు ఏకంగా 210 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వాళ్లకు ఓ రేంజ్​లో పోయించారు. మరి.. సుదర్శన్-గిల్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments