TS Inter Board: TS ఇంటర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ రిలీజ్!

TS ఇంటర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ రిలీజ్!

TS Inter Board: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును రిలీజ్ చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?

TS Inter Board: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును రిలీజ్ చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన లక్షల మంది విద్యార్థుల భవిత్యం తేలిపోయింది. ఈసారి తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. విద్యార్థులు రికార్డ్ స్థాయిలో మార్కులు సాధించి వండర్ సృష్టించారు. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి విషయంలో అధైర్య పడవొద్దని.. సప్లమెంటరీలో మంచి మార్కులు సంపాదించాలని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరగనున్నాయంటే?

తెలంగాణ ఇంటర్ ఫస్టీయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మే 24 వ దేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సందర్భంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది ఇంటర్ బోర్డు. ముందుగా 2024 మే 24 నుంచి జూన1 వరకు ఉన్న పరీక్షల తేదీలను మే24 నుంచి జూన్ 3 వరకు తేదీలను మార్చింది. మే 24 న నల్లగొండ – ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు జూన4 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 10 న ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నారు. జూన్ 11 న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యూకేషన్ పరీక్ష, 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్ మొదటి సంవత్సరం టైమ్ టేబుల్:

సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 : మే 24
ఇంగ్లీష్ పేపర్ 1 : మే 25
మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ – 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 : మే 28
మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 : మే 29
ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 : మే 30
కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 : మే 31
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్1 : జూన్ 1
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫి పేపన్ 1 : జూన్ 3

ఇంటర్ ద్వితీయ సంవత్సరం టైమ్ టేబుల్:

సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 : మే 24
ఇంగ్లీష్ పేపర్ 2 : మే 25
మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ – 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 : మే 28
మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 : మే 29
ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్2 : మే 30
కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్ 2 : మే 31
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 : జూన్ 1
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫి పేపన్ 21 : జూన్ 3

 

Show comments