బిగ్‌ బ్రేకింగ్‌: టీ20 వరల్డ్‌ కప్‌కు ముప్పు! పాకిస్థాన్‌ నుంచే బెదిరింపులు

బిగ్‌ బ్రేకింగ్‌: టీ20 వరల్డ్‌ కప్‌కు ముప్పు! పాకిస్థాన్‌ నుంచే బెదిరింపులు

West Indies, Terroriest Attack, T20 World Cup 2024: వచ్చే నెల ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో దాడులు చేస్తామంటూ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

West Indies, Terroriest Attack, T20 World Cup 2024: వచ్చే నెల ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో దాడులు చేస్తామంటూ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా జూన్‌ 2 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా దేశాలు టీ20 వరల్డ్‌ కప్‌ కోసం తమ తమ జట్లను కూడా ప్రకటించాయి. భారత సెలెక్టర్లు కూడా 15 మందితో కూడిన ఇండియన్‌ స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టోర్నీ ఆరంభానికి ముందు క్రికెట్‌ అభిమానులను, వరల్డ్‌ కప్‌లో పాల్గొన బోయే దేశాల గుండెలు అదిరిపడేలా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించే వెస్టిండీస్‌, అమెరికా దేశాలకు ఉద్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా మ్యాచ్‌లు జరిగే సమయంలో దాడికి పాల్పడతాం అంటూ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఈ బెదిరింపులు నార్త్‌ పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు నిర్ధారించింది. అయితే.. ఈ బెదిరింపులపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామంటూ వెస్టిండీస్‌, అమెరికా దేశాలు ప్రకటించాయి. అయితే.. జూన్‌ 2 నుంచి జూన్‌ 29 వరకు టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. జూన్‌ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడునుంది. అలాగే.. జూన్‌ 9 పాకిస్థాన్‌తో న్యూయార్క్‌లో మ్యాచ్‌ ఆడనుంది టీమిండియా. భారత జట్టును ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారా? అనే అనుమానాలు, భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, నమీబియా, వెస్టిండీస్, కెనడా, స్కాట్లాండ్, శ్రీలంక, నేపాల్‌, పాపువా న్యూ గినియా, యూఎస్‌ఏ, ఉగాండ జట్లు పాల్గొంటున్నాయి. మరి ఇన్ని జట్లకు భద్రత విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా బెదిరింపులు పాకిస్థాన్‌ నుంచి రావడంతో క్రికెట్‌ అభిమానుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments