IMD Warning To AP-Summer: APకి వాతావరణ శాఖ హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే

APకి వాతావరణ శాఖ హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే

ఏపీకి వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..

ఏపీకి వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. సాధారణంగా మే నెలలో పెరగాల్సిన ఎండలు మార్చిలోనే కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండి పోతున్నాయి. ఇక మధ్యాహ్నం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేడి తీవ్రత పెరగడంతో పాటు వడగాలలుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక గత వారం రోజుల నుంచి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రెండు నెలలు అనగా ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..

ఏపీ సముద్ర తీర ప్రాంతం కావడంతో ఉష్ణతాపం అధికంగా ఉండనుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రెండు నెలలు అనగా ఏప్రిల్, మే నెలలో ఎండలు మండిపోతాయి అంటున్నారు. జూన్ నెలాఖరు వరకు వేసవి తీవ్రత కొనసాగనుంది అని అంచాన వేస్తున్నారు. 2019లో మాదిరి ఈ ఏడాది కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వడగాడ్పులకు కూడా అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంటున్నారు. రాత్రివేళ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు కానున్నాయి అంటున్నారు. జూన్ మొదటివారం వరకు ఎల్ నినో పరిస్థితులు కొనసాగనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవరకు రాష్ట్రంలో ఎల్ నినో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక మూడురోజుల క్రితం అనంతపురంలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేడి ఎక్కువగా ఉండే సమయంలో బయటకు రాకపోవడమే మంచిది అంటున్నారు. చిన్నారులు, వయసుపైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Show comments