Hyderabad Excavations Lord Krishna Statue Found: హైదరాబాద్​లో తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుని విగ్రహం! ఇక్కడే అసలు ట్విస్ట్!

హైదరాబాద్​లో తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుని విగ్రహం! ఇక్కడే అసలు ట్విస్ట్!

హైదరాబాద్​లో ఓ చోట తవ్వకాల్లో శ్రీకృష్ణుని విగ్రహం బయటపడటం ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

హైదరాబాద్​లో ఓ చోట తవ్వకాల్లో శ్రీకృష్ణుని విగ్రహం బయటపడటం ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఎక్కడైనా తవ్వకాలు జరుగుతున్నాయి అంటే అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ఏవైనా పురాతన వస్తువులు, విగ్రహాలు లభిస్తాయేమోనని అంతా ఎదురు చూస్తుంటారు. అలా తవ్వకాల్లో అరుదైన విగ్రహాలు దొరికిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కావాలనే కొన్ని వస్తువులు పెట్టి తవ్వకాల్లో బయటపడినట్లుగా నమ్మించే ప్రయత్నాలు చేయడం కూడా వినే ఉంటారు. స్వార్థం, మోసం, స్వలాభం కోసం చేసిన ఇలాంటి ఘటనల గురించి పలుమార్లు వార్తల్లో రావడం కూడా చూస్తుంటాం. అయితే ఏదేమైనా తవ్వకాల్లో ఏవైనా విగ్రహాలు లాంటివి దొరికితే మాత్రం ఆ న్యూస్ ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో శ్రీకృష్ణుడి స్టాచ్యూ ఒకటి బయటపడింది.

హైదరాబాద్​ రాంకోఠిలోని గణేష్ ఆలయం పక్కన ఉన్న నవజీవన్ విమెన్స్ కాలేజీలో తవ్వకాలు జరిపారు. ఇందులో కృష్ణుడి విగ్రహం బయటపడింది. దీంతో భక్తజనం భారీగా అక్కడికి చేరుకొని పూజలు చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శుక్రవారం ఉదయం జరిపిన తవ్వకాల్లో కృష్ణుడి స్టాచ్యూ బయటపడిందని సుల్తాన్ బజార్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస చారి తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల కిందే ఈ కళాశాల మూతపడిందని, బిల్డింగ్​కు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. దీంతో దీన్ని తప్పుదోవ పట్టించేందుకు ఎవరో కావాలనే క్లోజ్ చేసి ఉన్న కాలేజీ మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి విగ్రహం పెట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ శ్రీనివాస చారి పేర్కొన్నారు.

Show comments